Saturday, April 20, 2024
- Advertisement -

అర్జున్ రెడ్డి హీరోయిన్‌తో విశాల్ పెళ్లి..

- Advertisement -

హీరో విశాల్ త్వ‌ర‌లో ఓ ఇంటి వాడు కాబోతున్నాడు. విశాల్ తండ్రి జీకే ఇప్పటికే ఈ విషయాన్ని స్పష్టం చేయగా… తాజాగా విశాల్ సైతం తాను పెళ్లి చేసుకోబోతున్న మాట వాస్తవమేనని పేర్కొన్నాడు. ఇదే అంశాన్ని ఆయన తన ట్విట్టర్ అకౌంట్ ద్వారా తెలియజేశారు.

విశాల్ పెల్లి చేసుకోబోయో హైదరాబాద్‌కు చెందిన ఓ వాణిజ్యవేత్త కుమార్తె అనీశా రెడ్డి. విశాల్ తండ్రి, నిర్మాత జికే రెడ్డి ఇటీవల మీడియా ద్వారా ఈ విష్యం వెల్లడించారు. దీంతో గత కొన్ని రోజులుగా విశాల్ పెళ్లిపై వస్తున్న వివిధ రూమర్లకు పుల్‌స్టాప్ పడింది. వీరి నిశ్చితార్థం హైదరాబాద్‌లోనే జరగనుంది.

హైదరాబాద్‌ బిజినెస్‌మేన్‌ విజయ్‌ రెడ్డి, పద్మజల కుమార్తె అయిన ఆమె.. అర్జున్‌ రెడ్డి, పెళ్లి చూపులు వంటి చిత్రాల్లో నటించారు. అర్జున్‌ రెడ్డి సినిమాలో ఆమె కీర్తి పాత్రని పోషించారు. విశాల్‌తో తన పెళ్లి గురించి అనీశా ఇన్‌స్టాగ్రమ్ ద్వారా వెల్లడించింది. విశాల్‌తో కలిసి తీసుకున్న ఫొటోను పోస్ట్ చేసింది.






Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -