Thursday, April 25, 2024
- Advertisement -

సీనియర్ హీరో తో వెబ్ సిరీస్ అంటున్న మంచు హీరో

- Advertisement -

మంచు విష్ణు చాలా రోజుల తర్వాత తన తదుపరి సినిమాల మీద ఒక క్లారిటీ ఇచ్చాడు. ఇటీవలే విడుదల అయిన చిత్రం ఓటర్ పెద్దగా ఆడకపోవడం తో విష్ణు నిరాశ పడిన విషయం నిజమే. కాకపోతే ఇప్పుడు ఆయన అవన్నీ మర్చిపోయి తన కొత్త సినిమాల మీద దృష్టి సారిస్తున్నారు. ఇప్పటికే రెండు మూడు కొత్త ప్రాజెక్ట్స్ ని ప్రకటించిన విష్ణు త్వరలో ఒక వెబ్ సిరీస్ ని కూడా నిర్మించనున్నారట.

అయితే ఈ వెబ్ సిరీస్ ఒక పొలిటికల్ డ్రామా గా తెరకెక్కనుంది అని తెలుస్తుంది. ఈ వెబ్ సిరీస్ లో సీనియర్ హీరో శ్రీకాంత్ ప్రధాన పాత్ర పోషించనున్నారట. శ్రీకాంత్ తో ఇప్పటికే స్క్రిప్ట్ చర్చలు పూర్తి అయ్యాయి అని తెలుస్తుంది. అన్నీ కుదిరితే వచ్చే నెల నుండి ఈ వెబ్ సిరీస్ షూటింగ్ మొదలు కానుంది అని తెలుస్తుంది.

అయితే శ్రీకాంత్ కూడా సినిమాల కన్నా వెబ్ ప్రాజెక్ట్స్ ద్వారా ప్రేక్షకులకి దగ్గర అవ్వాలని భావించడం తో ఈ ఒక్క వెబ్ సిరీస్ ఏ కాకుండా మరి కొన్ని ప్రాజెక్ట్స్ ని కూడా లైన్ లో పెట్టినట్టు తెలుస్తుంది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -