Thursday, March 28, 2024
- Advertisement -

భార్య ప్రసవాన్ని ఇంస్టాగ్రామ్ లైవ్ పెట్టనున్న మంచు విష్ణు

- Advertisement -

మంచు విష్ణు ఇటు పర్సనల్ లైఫ్ లో, అటు ప్రొఫెషనల్ లైఫ్ లో దూసుకుపోతున్న సంగతి మనకి తెలిసిందే. ఆల్రెడీ రెండు మూడు ప్రాజెక్ట్స్ ప్రకటించి బిజీ గా గడుపుతున్న విష్ణు ఇప్పుడు తన భార్య వెరోనికా ప్రసవం కోసం ఆతృతగా ఎదురు చూస్తున్నాడు. ఇప్పటికే ముగ్గురు పిల్లలకి తండ్రి అయిన విష్ణు మరొక చిన్నారి ని వెల్కమ్ చేసేందుకు ఎదురు చూస్తున్నాడు. అయితే ఆసక్తికరం గా తన భార్య ప్రసవం లైవ్ లో ఇంస్టాగ్రామ్ లో చేయాలని డిసైడ్ అయ్యాడట. ఈ ఐడియా కూడా విష్ణు కి కాజల్ ఇచ్చిందట. అంతే కాకుండా ఈ ప్రక్రియ అంతా కాజల్ దగ్గర ఉంది చూసుకోనుందట.

ఈ విషయాన్ని స్వయంగా విష్ణు తన ట్విట్టర్ ప్రొఫైల్ లో పేర్కొన్నాడు. ఈ విషయాన్ని ప్రస్తావిస్తూ, “అందాల తార కాజల్ అగర్వాల్ తో చాలా చర్చల అనంతరం నేను నా భార్య వెరోనికా ప్రసవాన్ని ఇంస్టాగ్రామ్ లో లైవ్ పెట్టనున్నాను. ఈ ఐడియా ఇచ్చినందుకు కాజల్ కి ధన్యవాదాలు.” అని విష్ణు తెలియజేసాడు.

ప్రస్తుతం విష్ణు మరియు కాజల్ కలిసి ఒక ఆసక్తికర చిత్రం లో నటిస్తున్నారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -