Friday, March 29, 2024
- Advertisement -

విశ్వక్ సేన్ బాలీవుడ్ డెబ్యూ కన్ఫర్మ్

- Advertisement -

ఫలక్ నుమా దాస్ సినిమా తో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు విశ్వక్సేన్. ఈ సినిమా కి ఆయనే దర్శకుడి గా నిర్మాత గా కూడా మారాడు. మలయాళం లో విజయం సాధించిన అంగమలీ డైరీస్ అనే సినిమా ని తెలుగు లో రీమేక్ చేశారు. అయితే ఈ సినిమా విడుదల అయినప్పటి నుండి సినిమా మీద విపరీతమైన నెగటివ్ టాక్ రావడం తో సినిమా కచ్చితం గా పరాజయం పొందుతుంది అని అందరూ జోస్యం చెప్పారు. ప్రేక్షకుల తో పాటు సమీక్షకులు కూడా ఈ సినిమా బాలేదు అని పెదవి విరిచిన నేపథ్యం లో ఈ సినిమా కి పెట్టిన డబ్బులు కూడా వచ్చే అవకాశం లేదు అని అంతా భావిస్తున్నారు.

ఈ విషయం విశ్వక్ సేన్ కి కూడా తెలుసు కానీ ప్రమోషన్స్ ఆపడం మంచిది కాదు కనుక, తన ప్రయత్నం తాను చేయాలి కనుక ప్రస్తుతం ఆంద్ర లో టూర్ ని అనౌన్స్ చేసాడు విశ్వక్. ఇదిలా ఉంటె త్వరలో నే ఇంకో సినిమా తో ఈయన మళ్ళి దర్శకత్వం ప్రతిభ చూపించనున్నాడు.

సోషల్ మీడియా లో తన తదుపరి చిత్రం గురించి చెప్తూ, హిందీ-తెలుగు బైలింగువల్ ప్రాజెక్ట్ ని త్వరలో చేయనున్నట్లు చెప్పాడు. మొదటి సినిమా తో నే మెప్పించలేకపోయాడు. రెండో సినిమా తో బాలీవుడ్ పయనం అయిత్ మాత్రం సినిమా విజయం సాధిస్తుందా అని పెదవి విరుస్తున్నారు కొందరు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -