రాహుల్ అవకాశావాది.. వితిక కామెంట్స్..!

3684
vithika sensational comments on rahul
vithika sensational comments on rahul

బిగ్ బాస్ తెలుగు మూడో సీజన్ కు రెండు తెలుగు రాష్ట్రాల్లో మంచి క్రేజ్ ఉంది. ఇటీవలే వరుణ్ సందేశ్ భార్య వితిక ఎలిమినేట్ అయిన విషయం తెలిసిందే. దాంతో ఇప్పుడు హౌస్ లో కేవలం ఆరుగురు మాత్రమే ఉన్నారు. అయితే 13 వారాల పాటు హౌస్ లో అందరితో సరదాగా ఉన్నప్పటికి బయటకు వచ్చాక తోటి కంటెస్టెంట్ అయిన రాహుల్ పై సంచలన కామెంట్స్ చేసింది వితిక.

విషయంలోకి వెళ్తే.. ఎలిమినేట్ తర్వాత తనీష్ ఇంటర్వ్యూలో పాల్గొంది వితిక. ఈ షోలో పలు విషయాలు చెప్పుకొచ్చింది. అయితే హౌస్ లో రాహుల్ ఎలా ఉండేవాడని తనీష్ అడిగిన ప్రశ్నకు ఊహించని సమాధానం ఇచ్చింది వితిక. రాహుల్ అవకాశావాది అంటూ పెద్ద బాంబు పేల్చింది. మొదట్లో మాతో బాగానే ఉన్నప్పటికి.. చివరికి వచ్చేసరికి మాతో సరిగ్గా మాట్లాడటం మానేశాడని.. ఒంటరిగా ఉంటున్నాడని తెలిపింది. ఈ కామెంట్స్ పై రాహుల్ ఫ్యాన్స్, నెటిజన్లు మండిపడుతున్నారు.

ఇంట్లో ఉన్నంతసేపు బ్రదర్ అంటూ పిలిచిన వితిక.. బయటకు రాగానే మారిపోయి.. రాహుల్ ను అలా అనడం ఎంటని ప్రశ్నిస్తున్నారు. రాహుల్ టైటిల్ విన్నర్ అయ్యే ఛాన్స్ ఉంది కాబట్టే వితిక ఇలా రాహుల్ పై కామెంట్స్ చేస్తుందని అంటున్నారు. అంతేకాకుండా అసలు వితిక ఎప్పుడో ఎలిమినేట్ కావాల్సిందని.. ఆమెకి ఇన్ని రోజులు ఉండే బలమైన కంటెస్టెంట్ కాదని.. అదృష్టం కొద్ది ఇన్ని రోజులు ఉందని వితికపై రాహుల్ ఫ్యాన్స్ రెచ్చిపోతున్నారు.

Loading...