వితికా ఎలిమినేట్.. రాహుల్ కు షాక్ ఇచ్చింది..!

981
Vithika Sheru Eliminated From Bigg Boss 3
Vithika Sheru Eliminated From Bigg Boss 3

బిగ్ బాస్ లో ఆదివారం ఎపిసోడ్ లో ఎలిమినేషన్ ప్రక్రియ జరిగింది. నాగార్జున తనదైన శైలిలీ ఆదివారం రోజు ఇంటి సభ్యులతో సరదా టాస్కులు చేయించి తెగ నవ్వించాడు. డ్యాన్స్ లు, ఆటలు తో ఎపిసోడ్ చాలా ఫనీగా సాగింది. ఇక మధ్య మధ్యలో ఎలిమినేషన్ నుంచి ఒకర్ని సేఫ్ చేస్తూ వచ్చారు. శనివారం రోజు శ్రీముఖి, రాహుల్, బాబా భాస్కర్ లు సేవ్ అయ్యారు. ఇక నామినేషన్ లో వరుణ్, అలీ, శివజ్యోతి, వితికా ఉన్నారు.

తాజాగా ఈ నలుగురికి నాలుగు ముంతలు ఇచ్చి.. గలగొట్టమని చెప్పారు. అందులో ఎవరి పేరు ఉంటే వారు సేఫ్ అయినట్లే అని తెలిపారు. అయితే ఆ ముంతల్లో శివజ్యోతి నేమ్ ఉంది. దాంతో ఆమె సేఫ్ అయింది. ఇక తర్వాత బిగ్ బాస్ ఇచ్చిన కార్డులు ముగ్గురు పంచుకోగా అలీ సేఫ్ లోకి వెళ్లారు. చివరగా భార్యాభర్తలు ఉన్న వరుణ్, వితికా పేర్లని నాగార్జున బోర్డు మీద పెడుతూ.. వరుణ్ సేఫ్ అయినట్లు ప్రకటించి.. వితికా ఎలిమినేట్ అయినట్లు తెలిపారు. ఇక భార్య వెళ్లడంతో వరుణ్ తెగ ఏడ్చాడు. ఇక తర్వాత బయటకు వచ్చిన వితిక స్టేజ్ మీద నుంచి ఇంటి సభ్యులతో మాట్లాడి.. రాహుల్ కు ఊహించని షాక్ ఇచ్చింది. నువ్వు ఫేక్ రిలేషన్ మెంటైన్ చేసినట్లు అనిపించింది అంటూ తన మనసులో మాట బయటకు చెప్పింది.

అయితే వితికా 13 వారాల పాటు బిగ్ బాస్ హౌస్ లో ఉండటం అనేది ఆశ్చర్యకరమనే చెప్పాలి. అసలు ఆమె మూడో వారంలోనే ఎలిమినేట్ కావాల్సింది. కానీ వైల్డ్ కార్డ్ ద్వారా వచ్చిన తమన్నా సింహాద్రి వల్ల వితికా సేఫ్ అయింది. ఆ వారంలో వితికా, తమన్నాలకు తక్కువ ఓట్లు వచ్చాయి. కానీ తమన్నా చేసిన రచ్చను తట్టుకోలేక ఆమెను ప్రేక్షకులు ఎలిమినేట్ అయ్యేలా చేశారు. అప్పుడు తమన్నా లేకుంటే ఖచ్చితంగా వితికా బయటకు వెళ్లేది. ఆ తర్వాత ఆమెకు తన గ్రుప్ అండగా ఉండటం.. ఒకసారి కెఫ్టెన్ కావడం.. నెక్ట్స్ మెడాలియన్ ఉపయోగించడం వల్ల నామినేషన్ నుంచి తప్పించుకుంది. వితికా 13 వారాలు హౌస్లో కొనసాగి ఎలిమినేట్ అయింది.

Loading...