ఎలిమినేట్ పై షాకింగ్ కామెంట్స్ చేసిన వితికా..!

12247
vithika sheru opens about her elimination
vithika sheru opens about her elimination

బిగ్ బాస్ తెలుగు మూడో సీజన్ చాలా ఆసక్తికరంగా సాగుతోంది. ఇటీవలే వితికా ఎలిమినేట్ అయింది. ఆమె వెళ్తుంటే వరుణ్ తెగ ఏడ్చాడు. అయితే తన ఎలిమినేషన్ పై వితికా పలు ఆసక్తికరమైన విషయాలను చెప్పుకొచ్చింది. వరుణ్ లేకుండా తాను సింగిల్ గా వచ్చి ఉంటే ఖచ్చితంగా ఇన్ని రోజులు మాత్రం ఉండేదాన్ని కాదని చెబుతోంది. ఇప్పటికే సోషల్ మీడియాలో వితికా ఎలిమినేషన్ పై ట్రోలింగ్ బాగా జరుగుతోంది.

అసలు ఆమె ఇన్నాళ్ళూ అక్కడెలా ఉందో అంటూ కామెంట్స్ చేస్తున్నారు. వితికాకు అంత సీన్ లేదు.. రెండో వారంలోనే ఆమె బయటకు రావాల్సింది. కానీ కొన్ని అనుకోకుండా జరిగిన కారణాల చేత ఆమె హౌస్ లో ఇన్ని రోజులు రాణించింది అని నెటిజన్లు అంటున్నారు. అయితే ఇదే విషయం గురించి వితికాను అడిగితే.. తాజాగా తనీష్ షో లో ఆమె మాట్లాడుతూ.. వరుణ్ తో కలిసి వచ్చాను కాబట్టే ఇన్ని రోజులు ఉండగలిగాను అని ఓపెన్ గా చెప్పింది. ఇదే నిజం కూడా.. ఎందుకంటే ఆమె ఒక్కతే ఈ షోకి వచ్చి ఉంటే ఖచ్చితంగా రెండు వారాలు కూడా ఉండేది కాదని చాలా ట్రోల్స్ వచ్చాయి. కానీ భార్య భర్తలు వచ్చారు కాబట్టి.. వాళ్ల రొమాన్స్ వర్కవుట్ అవుతుంది కాబట్టి కొన్ని వారాలు ఆమెను కనీసం నామినేషన్స్ వైపు కూడా రాకుండా జాగ్రత్తలు తీసుకున్నాడు బిగ్ బాస్. దాంతో ఆమె 13 వారాలు హౌస్ లో ఉండే ఛాన్స్ దక్కించుకుంది. ఇంట్లో ఉన్న కంటెస్టెంట్స్ కంటే వితికా చాలా వీక్ అని తెలుసు. వరుణ్ వల్లే ఇన్ని రోజులు హౌస్ లో ఉన్నానని వితికా కూడా ఒప్పుకుంది.

ఇదే నిజం కూడా.. ఎందుకంటే ఆమె ఒక్కతే ఈ షోకి వచ్చి ఉంటే ఖచ్చితంగా రెండు వారాలు కూడా ఉండేది కాదని చాలా ట్రోల్స్ వచ్చాయి. కానీ భార్య భర్తలు వచ్చారు కాబట్టి.. వాళ్ల రొమాన్స్ వర్కవుట్ అవుతుంది కాబట్టి కొన్ని వారాలు ఆమెను కనీసం నామినేషన్స్ వైపు కూడా రాకుండా జాగ్రత్తలు తీసుకున్నాడు బిగ్ బాస్. దాంతో ఆమె 13 వారాలు హౌస్ లో ఉండే ఛాన్స్ దక్కించుకుంది. ఇంట్లో ఉన్న కంటెస్టెంట్స్ కంటే వితికా చాలా వీక్ అని తెలుసు. వరుణ్ వల్లే ఇన్ని రోజులు హౌస్ లో ఉన్నానని వితికా కూడా ఒప్పుకుంది.

Loading...