Friday, April 26, 2024
- Advertisement -

రాహుల్ కు, శ్రీముఖి కి మధ్య ఓట్ల తేడా ఎంతంటే ?

- Advertisement -

15 వారాల పాటు సాగిన తెలుగు బిగ్ బాస్ మూడో సీజన్ తాజాగా ముగిసింది. బిగ్ బాస్ టైటిల్ ను సింగర్ రాహుల్ సిప్లిగంజ్ గెలుచుకున్నాడు.చిరంజీవి చేతుల మీదగా 50 లక్షల నగదు బహుమతి, ట్రోఫీని అందుకున్నాడు. ఇక యాంకర్ శ్రీముఖి రన్నరప్ గా నిలిచింది. ఇక రాహుల్ విషయానికి వస్తే రాహుల్ హౌస్ లో ఎలాంటి అంచానాలు లేకుండా ఉన్నాడు. ప్రతి వారం రాహుల్ ఎలిమినేట్ అవుతూ వచ్చాడు.

ఆ క్రమంలోనే అతను ప్రేక్షకులకు దగ్గరయ్యాడు. రాహుల్, శ్రీముఖి గొడవ విషయంలో ఎక్కువ సింపతీ రాహుల్ కి రావడం కూడా అతనికి ప్లస్ పాయింట్ అయింది. పునర్నవితో క్లోజ్ గా ఉండటం యూత్ బాగా కనెక్ట్ అయింది. ఇక బయటకు వచ్చిన పునర్నవి.. రాహుల్ కోసం ప్రచారం కూడా బాగా చేసింది. ఆ రకంగా అన్ని రాహుల్ కు కలిసి రావడం వల్ల అతను విజేతగా నిలిచాడు. చివరికి అత్యధిక ఓట్ల మెజార్టీతో రాహుల్ టైటిల్‌ను సొంతం చేసుకున్నాడు.

రాహుల్‌కి అత్యధికంగా 35 శాతం ఓటింగ్ నమోదైనట్లు తెలుస్తోంది. శ్రీముఖికి 28 శాతం, బాబా భాస్కర్‌కు 20%, వరుణ్ సందేశ్‌కు 10%, అలీ రెజాకు 7% ఓటింగ్ వచ్చినట్లుగా సమాచారం. ఇక ముందు నుంచి చాలా స్ట్రాంగ్ కంటెస్టెంట్‌గా ఉన్న శ్రీముఖి చివ‌ర్లో ఓటింగ్ రేసులో వెన‌క‌ప‌డిపోయింది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -