Tuesday, April 16, 2024
- Advertisement -

వి.వి.వినాయక్ వల్లనే వాయిదా పడుతున్న సినిమా షూటింగ్

- Advertisement -

టాలీవుడ్ లో ప్రముఖ దర్శకుడిగా పేరు ఉన్న వి.వి.వినాయక్ ఇప్పుడు హీరోగా మారబోతున్న సంగతి తెలిసిందే. దిల్ రాజు నిర్మాణంలో వి.వి.వినాయక్ హీరోగా ఒక సినిమా త్వరలో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ సినిమా షూటింగ్ త్వరలో మొదలు కానుంది. అయితే షూటింగ్ మొదలు పెట్టే కంటే ముందు వి.వి.వినాయక్ బరువు తగ్గాల్సి ఉంది. ప్రస్తుతం వి.వి.వినాయక్ ఉన్న ఫిజిక్ తాను పోషించబోయే పాత్రకు ఏమాత్రం సెట్ కాకపోవడంతో ఈ చిత్ర షూటింగ్ ఇంకా వాయిదా పడుతూ వస్తోంది అని సమాచారం.

ఈ నేపథ్యంలో వి.వి.వినాయక్ బరువు తగ్గే వరకు సినిమా షూటింగ్ మొదలు పెట్టడానికి కుదరదు. అందుకే వివి వినాయక గత కొన్ని రోజులుగా ప్రత్యేక జాగ్రత్తలు తీసుకొని మరీ బరువు తగ్గడానికి విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారని, షూటింగ్ త్వరగా మొదలుపెట్టడానికి ప్రయత్నిస్తున్నారని సమాచారం అందుతోంది. నరసింహారావు ఈ సినిమాకి దర్శకుడిగా వ్యవహరించనున్నారు. గతంలో ‘శరభ’ అనే సినిమాకి దర్శకత్వం వహించిన ఈయన ఇప్పుడు ప్రముఖ దర్శకుడు వినాయక్ ను హీరోగా పరిచయం చేయబోతున్నారు అన్నమాట.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -