రాజకీయాల వైపు అడుగులు వేస్తున్న మెగా డైరెక్టర్

251
VV Vinayak to going to Join Ysrcp
VV Vinayak to going to Join Ysrcp

టాలీవుడ్ లో పేరు మోసిన దర్శకులలో ఒకరైన వి.వి.వినాయక్ గత కొంతకాలంగా సినిమాలకు దూరంగా ఉన్న సంగతి తెలిసిందే. అయితే తాజాగా వి.వి.వినాయక్ ఇప్పుడు రాజకీయాల లోకి అడుగుపెట్టనున్నారు అంటూ కొన్ని పుకార్లు వినిపిస్తున్నాయి. ప్రస్తుతం ఆంధ్ర ప్రదేశ్ లో అధికారంలో ఉన్న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జెండా ని వినియక్ పట్టుకొనున్నారు అని సమాచారం. తాజాగా వి.వి.వినాయక్ వైస్సార్సీపీ ఎమ్మెల్యే జక్కంపూడి రాజా కాపు కార్పొరేషన్ చైర్మన్ గా ప్రమాణస్వీకారం చేస్తున్న సమయంలో వి.వి.వినాయక్ కూడా ఉన్నారు.

వివి వినాయక్ కూడా రాజకీయాల్లోకి రావడానికి ఆసక్తి చూపిస్తున్నారని తెలుస్తోంది. నిజానికి ప్రజారాజ్యం పార్టీ మరియు జనసేన పార్టీ నుంచి ఎమ్మెల్యే టికెట్ పొందటానికి వినాయక్ ప్రయత్నించారు కానీ కొన్ని కారణాల వల్ల వి.వి.వినాయక్ రాజకీయాల ఐడియా వదులుకున్నారు. ఇప్పుడు మళ్లీ రాజకీయాల్లో తన అదృష్టాన్ని పరీక్షించుకోవాలని అనుకుంటున్న వినాయక్ ఈసారి అధికారంలో ఉన్న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ వైపు మొగ్గు చూపుతున్నారట. అన్నీ అనుకున్నట్లు జరిగితే 2024 ఎలక్షన్స్ లో వివి వినాయక్ తప్పకుండా పాల్గొంటారని తెలుస్తోంది.

Loading...