Thursday, April 25, 2024
- Advertisement -

సినిమా కోసం బరువు తగ్గుతున్న వినాయక్

- Advertisement -

మాస్ కమర్షియల్ సినిమాలని దర్శకత్వం వహించడం లో పేరు ఉన్న వీ వీ వినాయక్ త్వరలో ఒక సినిమా తో నటుడిగా అరంగేట్రం చేయనున్నాడు అనే విషయం మన అందరికీ తెలిసిందే. అయితే దర్శకుడి గా ప్రస్తుతం తన కెరీర్ కి పాజ్ ఇచ్చి వినాయక్ నటుడిగా బిజీ అవ్వాలనే తలంపు తో ఉన్నారు. ఈ సినిమా కి సంబందించిన అధికారిక ప్రకటన చాలా రోజుల కిందనే వచ్చింది కానీ ఇప్పుడు షూటింగ్ గురించి ఒక ఆసక్తికర అంశం బయటకు వచ్చింది.

మొదటి షెడ్యూల్ ని త్వరలో నే నిర్మాతలు మొదలు పెట్టనున్నారు. అయితే ఈ షెడ్యూల్ తర్వాత వినాయక్ తదుపరి షూటింగ్ కోసం బరువు తగ్గే కార్యక్రమం చేపట్టనున్నారట. వినాయక్ మునుపెన్నడూ లేని విధం గా పూర్తి బరువు తగ్గడమే కాకుండా ఒక కొత్త లుక్ లో మనకి దర్శనం ఇవ్వనున్నాడు అని తెలుస్తుంది. తెలుగు లో ఇంతకు ముందు శరభ అనే సినిమా ని తీసిన నరసింహారావు ఈ సినిమాకి దర్శకుడుగా వ్యవహరించనున్నారట. టైటిల్ ఇంకా ఖరారు చేయని ఈ సినిమా కి దిల్ రాజు నిర్మాత గా వ్యవహరించనున్నారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -