Friday, April 19, 2024
- Advertisement -

ఎన్టీఆర్ ఫ్యాన్స్ కి నిరాశ.. ఫస్ట్ లుక్ లేదు..!

- Advertisement -

రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్ హీరోలుగా రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతున్న భారీ చిత్రం ఆర్ఆర్ఆర్‌. అయితే తారక్ బర్త్ డే సందర్భంగా ఆర్ఆర్ఆర్‌ నుంచి ఓ ప్రత్యేక వీడియో, ఆయన ఫస్ట్ లుక్‌ రిలీజ్ చేయాలని చిత్ర యూనిట్ నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే.

కొమరం భీమ్ పాత్రను పరిచయం చేస్తూ మే 20న వీడియోను రిలీజ్ చేస్తారని ఆశ పడిన ఎన్టీఆర్ ఫ్యాన్స్ కు నిరాశే మిగిలింది. ’లాక్‌డౌన్‌ను మరోసారి పొడిగించారు.. పనులు ఆగిపోయాయి.. అయినప్పటికీ మేము వీలైనంత ప్రయత్నించాం. తారక్ బర్త్ డేకి ట్రీట్‌ ఇవ్వాలని భావించాం. కానీ, ‌ వీడియోకు సంబంధించిన పనులు పూర్తి చేయలేకపోయాం’ అంటూ ఆర్‌ఆర్‌ఆర్‌ ప్రకటన చేసింది. దాంతో ఎన్టీఆర్ బర్త్ డే కు వీడియో గానీ.. ఫస్ట్ లుక్ గానీ రిలీజ్ చేయట్లేదని స్పష్టం చేశారు. ఏదో ఒకటి విడుదల చేసేయాలన్నది తమకు ఇష్టం ఉండదని, మీ ఎదురుచూపులకు తగ్గా రీతిలో అది ఉంటుందని ప్రామిస్ చేస్తున్నామని పేర్కొంది.

అది ఎప్పుడు వచ్చినా, మనందరికీ ఒక పెద్ద పండగలా ఉంటుందని మాత్రం కచ్చితంగా చెప్పగలమని ఆర్ఆర్ఆర్ మూవీ టీమ్ తెలిపింది. అయితే, ఈ ప్రకటనపై ఎన్టీఆర్‌ అభిమానులు కోపడుతున్నారు. ఎంతో ఆశగా ఎదురు చూస్తుంటే ఇలా చేస్తారా ? కనీసం ఫస్ట్ లుక్ అయిన రిలీజ్ చేయమని ఫ్యాన్స్ కామెంట్స్ పెడుతున్నారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -