Friday, March 29, 2024
- Advertisement -

సమంత నాగ చైతన్య రూటు ఫాలో అవ్వనున్న నయనతార మరియు విఘ్నేశ్ శివన్

- Advertisement -

సౌత్ లేడీ సూపర్ స్టార్ నయనతార గత కొంత కాలంగా ప్రముఖ కోలీవుడ్ దర్శకుడు విగ్నేష్ శివన్ తో ప్రేమలో ఉందని అందరికీ తెలిసిందే. 2015లో తమిళ సినిమా ‘నానుమ్ రౌడీ దాన్’ కి విఘ్నేశ్ శివన్ దర్శకత్వం వహించగా నయనతార హీరోయిన్ గా నటించింది. ఆ సినిమా సమయంలో వీరిద్దరి పరిచయం ప్రేమగా మారింది. కోలీవుడ్లోని పాప్యులర్ జంటలలో ఈ జంట కూడా ఒకటి. అయితే గత కొన్ని నెలలుగా నయనతార మరియు విఘ్నేశ్ శివన్ ల పెళ్లి గురించి బోలెడు పుకార్లు బయటకు వస్తున్నాయి. తాజాగా సమాచారం ప్రకారం నయనతార మరియు విఘ్నేశ్ శివన్ త్వరలోనే పెళ్లి పీటలు ఎక్కబోతున్నట్టు కోలీవుడ్ వర్గాలు కోడై కూస్తున్నాయి.

వీళ్లిద్దరూ డెస్టినేషన్ వెడ్డింగ్ ప్లాన్ చేస్తున్నారని తెలుస్తోంది. అది ఎక్కడ అని మాత్రం ఇంకా క్లారిటీ రావాల్సి ఉంది. విఘ్నేశ్ శివన్ ఒక ట్రెడిషనల్ హిందూ తమిళ కుటుంబంలో పుట్టి పెరుగగా, నయనతార మలయాళీ క్రిస్టియన్ కుటుంబం నుంచి వచ్చింది. కాబట్టి సమంత నాగ చైతన్య లాగా నయనతార విఘ్నేష్ శివన్ కూడా హిందూ మరియు క్రిస్టియన్ ట్రెడిషనల్ ల ప్రకారం రెండు సార్లు పెళ్లి చేసుకోబోతున్నట్లు సమాచారం. ఏదేమైనా వీళ్ళ పెళ్లి గురించి చాలా కాలంగా పుకార్లు అయితే వినిపిస్తున్నాయి కానీ అధికారిక ప్రకటన మాత్రం ఇంకా విలువలడటం లేదు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -