Tuesday, March 19, 2024
- Advertisement -

మహేష్ బాబు ని పూర్తి గా మార్చేసిన మహర్షి

- Advertisement -

సూపర్ స్టార్ మహేష్ బాబు వంశీ పైడిపల్లి తో మొట్ట మొదటి సారిగా పని చేసిన చిత్రం మహర్షి. దాదాపుగా మూడేళ్ల పాటు సాగిన వీళ్ళ జర్నీ మహర్షి సినిమా విడుదల తో ఒక కామా స్టేజ్ కి వచ్చింది. అయితే మహేష్ బాబు తను పని చేసే ప్రతి దర్శకుడికి గౌరవం ఇస్తాడు కానీ ఈ సారి వంశీ పైడిపల్లి మీద మాత్రం ఎనలేని ప్రేమ, అభిమానాన్ని చూపిస్తున్నాడు. దీని పై స్పెషల్ రీజన్ ఏమీ లేకపోయినా తను ఎప్పటి నుండో ఎదురు చూస్తున్న సక్సెస్ ని తను ఆశించిన స్థాయి కంటే ఎక్కువ ఇచ్చినందుకు వంశీ పైడిపల్లి మీద ఇంత అభిమానం సంపాదించుకున్నాడు అని తన సన్నిహిత వర్గాలు చెప్తున్నాయి.

అయితే ఇటీవలే ఒక ఇంటర్వ్యూ లో మాట్లాడుతూ మహేష్ బాబు మహర్షి సినిమా తనలో ఎంత లా మార్పు తీసుకొచ్చిందో వివరించాడు. ఒక మనిషి గా మహర్షి సినిమా తనలో చాలా మార్పులు తీసుకొచ్చింది అని అందుకని ఈ సినిమా తన కెరీర్ లో మెమొరబుల్ సినిమా అవుతుంది అని ఈ సినిమా తీసిన వంశీ పైడిపల్లి కి కృతజ్ఞుడిగా ఉంటాను అని మహేష్ బాబు చెప్పడం విశేషం.

ఇప్పటికే మహర్షి సినిమా అనేక రికార్డుల ను సొంతం చేసుకొని విజయ పరం పరం కొనసాగిస్తుంది. ఈ రోజు ఈ సినిమా విజయోత్సవ సభ విజయవాడ లో జరగనున్నది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -