Friday, March 29, 2024
- Advertisement -

నెటీజన్ కి అదిరిపోయే జవాబిచ్చిన ఇలియానా

- Advertisement -

సోషల్ మీడియా పుణ్యమా అని ట్రోల్లర్ లకి ఇతరులపై కామెంట్లు చేయడం చాలా సులువు అయిపోయింది. ఇక సెలబ్రిటీలు కూడా సోషల్ మీడియాలో ట్రోలింగ్ కి అలవాటు పడిపోయారు. ఇప్పటికే చాలావరకు సెలబ్రిటీలు అందరూ ఇలాంటి ట్రోల్లర్స్ చేసే కామెంట్స్ కి సైలెంట్ గా ఉంటారు కానీ తాజాగా హాట్ బ్యూటీ ఇలియానా డిక్రూజ్ ఒక నెటిజన్ నోరు మూయించేలా జవాబిచ్చింది. తాజాగా ఇలియానా ఇంస్టాగ్రామ్ లో ఆస్క్ మీ ఎనీథింగ్ అంటూ ఒక ఆసక్తికరమైన చాట్ సెషన్ లో పాల్గొంది. దీంట్లో చాలా మంది అభిమానులు ఆమెను ప్రశ్నలు అడగా ఆమె ఓపిగ్గా వాటికి సమాధానాలు ఇచ్చింది.

అయితే ఇందులో ఒకడు ‘మీరు మీ వర్జినిటీ ని ఎప్పుడు కోల్పోయారు?’ అంటూ అడిగాడు. దానికి ఇలియానా అతడి మైండ్ బ్లాక్ అయ్యేలా జవాబిచ్చింది. “వావ్ మీ అమ్మగారు అయితే ఈ ప్రశ్నకి ఏమని జవాబిస్తారు? అడుగు అడుగు” అంటూ జవాబిచ్చింది ఇలియానా. ఇలియానా రిప్లై సూపర్ అంటూ అభిమానులు కూడా సోషల్ మీడియాలో కామెంట్లు చేస్తున్నారు. ఇక సినిమాల పరంగా ఈ మధ్యనే చాలా కాలం తర్వాత తెలుగులో ‘అమర్ అక్బర్ ఆంటోనీ’ అనే సినిమాతో ఎంట్రీ ఇచ్చింది ఇలియానా కానీ ఆ సినిమా డిజాస్టర్ గా మారిన సంగతి తెలిసిందే.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -