Saturday, April 20, 2024
- Advertisement -

అర్జున్ సురవరం ఎక్కడ?

- Advertisement -

కిరాక్ పార్టీ అనే సినిమా తో పరాజయం పొందాక నిఖిల్ ఒక మంచి చిత్రం తో ప్రేక్షకుల ముందుకు రావాలని సిద్ధపడ్డాడు. చాలా కథలు అనుకోని, అవి కుదరక చివరికి ఒక రీమేక్ చిత్రానికి సాయి అన్నాడు నిఖిల్. తమిళం లో ఘానా విజయం సాధించిన కనితాన్ అనే చిత్రానికి రీమేక్ గా ఈ సినిమా తెలుగు లోకి వస్తుంది. అయిత్ ఈ సినిమా కి ముందుగా ముద్ర అనే టైటిల్ ని ఖరారు చేసిన నిర్మాతలు ఆ తర్వాత అనివార్య కారణాల వలన టైటిల్ ని మార్చవలసిన పరిస్థితి వచ్చింది.

అప్పుడు ఈ చిత్రానికి “అర్జున్ సురవరం” అనే టైటిల్ ని ఖరారు చేశారు దర్శక నిర్మాతలు. గత రెండు నెలలు గా ఈ సినిమా విడుదల కు నోచుకోవడం లేదు. ఎప్పుడు విడుదల చేయాలనీ భావించినా ఏవో అడ్డంకులు వస్తున్నాయి. ముందు గా మార్చ్ 29 న ఈ సినిమా విడుదల తేదీ ని ఖరారు చేసాక ఆ తర్వాతా ఈ సినిమా ని మే 1 కి షిఫ్ట్ చేశారు. మరలా ఈ సినిమా ని మే ఎండింగ్ కి తీసుకు రావాలని భావించిన దర్శక నిర్మాతలు ప్రస్తుతం ఈ సినిమా తేదీ ని ఇంకా ఖరారు చేయలేదు.

ఇప్పటికీ చాలా సినిమాలు విడుదల అవుతున్న తరుణం లో ఈ సినిమా ఇంకా విడుదల కాకపోవడం విచిత్రం గా ఉంది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -