Friday, April 26, 2024
- Advertisement -

“విజిల్” మూవీ రివ్యూ..!

- Advertisement -

విజయ్ హీరోగా నయనతార హీరోయిన్ గా అట్లీ డైరెక్షన్ లో తెరకెక్కిన చిత్రం “బిగిల్”. తెలుగులో ఈ సినిమాని విజిల్ పేరుతో రిలీజ్ చేశారు. భారీ అంచనాలతో ఈ రోజే రిలీజ్ అయిన ఈ సినిమా ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం.

కథ : మైఖల్ (విజయ్).. కొన్ని కారణాల వల్ల అతను చేరుకోవాల్సిన లక్ష్యాన్నికి దూరం అవుతాడు. కొంత కాలం తర్వాత ఓ మహిళా ఫుట్ బాల్ టీంకు కోచ్ గా వెళ్తాడు. అక్కడ మైఖైల్ ఏం చేశాడు ? అసలు బిగిల్ అనే పాత్రకు విజయ్ కు లింక్ ఏంటి ? అనేవి తెలుసుకోవాలంటే సినిమా చూడాల్సిందే.

ప్లస్ పాయింట్స్ :

విజయ్ చేసిన రెండు పాత్రలకు న్యాయం చేశాడు. ఎమోషన్ సీన్స్ అతను పలికించిన హావభావాలు చాలా బాగున్నాయి. యాక్షన్ సీన్స్ అదరగొట్టాడు. సెకండాఫ్ ను చాలా ఆసక్తికరంగా తెరకెక్కించాడు దర్శకుడు. నయనతార ఎప్పటిలానే తన పాత్రకు న్యాయం చేసింది. కామెడీ, ఎమోషన్స్ అన్ని సెకండాఫ్ లోనే ఉంటాయి. ఫుట్ బాల్ మ్యాచెస్ తెరకెక్కించిన విధానం బాగుంది. తమిళ్ బిజీ కమెడియన్ యోగి బాబు మరియు వివేక్ ల కామెడీ ట్రాక్స్ బాగున్నాయి. ఏ ఆర్ రెహమాన్ అందించిన మ్యూజిక్ పర్వాలేదు అనిపించినా.. బ్యాక్ గ్రౌండ్ స్కోర్ మాత్రం చాలా బాగుంది. జి కె విష్ణు అందించిన సినిమాటోగ్రఫీ బాగుంది. నిర్మాణ విలువలు హై రెంజ్ లో ఉన్నాయి.

మైనస్ పాయింట్స్ :

ముందుగా చెప్పుకోవాల్సింది అట్లీ రాసుకున్న కథ. బలమైన పాయింట్ కథలో లేకపోవడం ఈ సినిమాకి మైనస్ పాయింట్. ఇక సినిమా నిడివిడి ఎక్కవగా ఉండటం వల్ల మధ్య మధ్యలో చూసే ప్రేక్షుకుడికి బోరుగా ఉంటుంది. ఫస్ట్ ఆఫ్ లో చాలా చోట్ల బోరు కొట్టించాడు డైరెక్టర్.

మొత్తంగా : ఈ విజిల్ ఫస్ట్ ఆఫ్ లో కాస్త నెమ్మదిగ వెళ్లిన సెకండాఫ్ మాత్రం మంచి ఎమోషన్స్ తో, మాస్ ఎలమెంట్స్ తో సాగుతోంది. కథ విషయంను పెద్దగా పట్టించుకోకుండా చూస్తే ఈ సినిమాని ఎంజాయ్ చేస్తారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -