Friday, April 26, 2024
- Advertisement -

ఎన్టీఆర్ బ‌యోపిక్‌లో పురందేశ్వరిగా ఎవ‌రు చేస్తున్నారో తెలుసా?

- Advertisement -

ఉమ్మ‌డి ఆంధ్ర‌ప్ర‌దేశ్ మాజీ ముఖ్య‌మంత్రి,న‌టుడు,తెలుగు జాతి ఖ్యాతిని ప్ర‌పంచం మొత్తం చాటి చెప్ప‌న వ్య‌క్తి శ్రీ నందమూరి తారక రామారావు .ఇప్పుడు ఆయ‌న జీవిత క‌థ‌ను ఎన్టీఆర్ పేరుతో సినిమాగా తెర‌కెక్కిస్తున్న సంగ‌తి తెలిసిందే.ఈ సినిమాలో ఎన్టీఆర్ పాత్ర‌ను ఆయ‌న త‌న‌యుడు హీరో బాల‌కృష్ణ పోషిస్తున్నారు.ఈ సినిమాను ఆయ‌నే త‌న నిర్మాణ సంస్థ‌లో నిర్మిస్తున్నారు.శరవేగంగా షూటింగ్ జ‌రుపుకుంటున్న ఈ సినిమాను సంక్రాంతికి విడుద‌ల చేయ‌డానికి స‌న్నాహాలు చేస్తున్నారు.ఎన్టీఆర్‌ బ‌యోపిక్ ద‌ర్శ‌కుడు క్రిష్ చేతుల‌లోకి వెళ్లిన దగ్గ‌ర నుంచి సినిమాపై అంచ‌నాలు పెరిగాయి.సినిమాకు సంబంధించిన ఏదో ఒక వార్త బ‌య‌టికి వ‌స్తునే ఉంది.చంద్రబాబుగా రానా, నాగేశ్వరరావుగా సుమంత్, బసవతారకంగా విద్యాబాలన్ నటిస్తున్నారు.

సావిత్రిగా నిత్యామీన‌న్‌,శ్రీదేవి పాత్రకి గాను రకుల్ ప్రీత్‌ను తీసుకున్నారు.ఇక్క‌డి వ‌ర‌కు బాగానే ఉంది ,మ‌రి ఎన్టీఆర్ కుతురు మాజీ కేంద్ర‌మంత్రి ద‌గ్గుపాటి పురందేశ్వరి పాత్రను ఎవ‌రు పోషిస్తున్నారు అనే ప్ర‌శ్న అంద‌రిలోను ఉంది. పురందేశ్వరి పాత్రను విజయవాడకు చెందిన ప్రముఖ నృత్యకారిణి హిమన్సీ పోషిస్తున్నట్టు వార్తలు వస్తున్నాయి. ప్రస్తుతం ఆమె షూటింగ్ లో కూడా పాల్గొంటున్నారట. అంతేకాదు, పురందేశ్వరి గెటప్ లో ఉన్న హిమన్సీ ఫొటో ఒకటి ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.హిమన్సీ వెళ్లి పురందేశ్వరిని క‌లిసిన ఫోటోలు కొన్ని సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారాయి. మ‌రి ఎన్టీఆర్ బ‌యోపిక్‌లో పురందేశ్వరి పాత్ర‌ను హిమన్సీ చేస్తుందో లేదో చిత్ర యూనిట్ ప్ర‌క‌టించే వ‌ర‌కు వేచి చూడాల్సిందే.

 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -