టాలీవుడ్ లో డ్రగ్స్ వాడేది ఎవరంటే..శ్రీరెడ్డి సంచలనం..?

595
Who used drugs in Tollywood..Srireddy sensation
Who used drugs in Tollywood..Srireddy sensation

ఓ వైపు బాలీవుడ్ లో డ్రగ్స్ కేసు రోజు రోజు కు ఇంటరెస్టింగ్ గా సాగిపోతుంటే టాలీవుడ్ లో వాటి నీడలు కనిపిస్తుండడం ఇక్కడి వారికి టెన్షన్ ని తెప్పిస్తుంది.. ఇప్పటికే టాలీవుడ్ హీరోయిన్ రాకుల్ ప్రీత్ సింగ్ ఈ డ్రగ్స్ కేసు ఉందని తేలడంతో ఇంకా ఎవరెవరున్నారా అని ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.. తాజగా వివాదాలకు కేరాఫ్ అడ్రస్ అయిన సినీ నటి శ్రీరెడ్డి మరోసారి సంచలన వ్యాఖ్యలు చేసింది.

బాలీవుడ్ ను డ్రగ్స్ వ్యవహారం కుదిపేస్తున్న నేపథ్యంలో సోషల్ మీడియా ద్వారా శ్రీరెడ్డి ఒక వీడియో విడుదల చేసింది. ఈ వీడియోలో ఆమె కీలక వ్యాఖ్యలు చేసింది. టాలీవుడ్ లో సైతం చాలా మంది డ్రగ్స్ తీసుకుంటారని శ్రీరెడ్డి ఆరోపించింది.

చాలా మంది సెలబ్రిటీలు రేవ్ పార్టీలను నిర్వహిస్తుంటారని చెప్పింది. పెద్దపెద్ద హోటల్స్ లో కూడా పార్టీలు ఏర్పాటు చేసుకుంటారని, వీటిలో డ్రగ్స్ తీసుకుంటారని తెలిపింది. అంతేకాదు ఈ పార్టీలకు వచ్చే అమ్మాయిలకు డ్రగ్స్ ఇచ్చి, వారిని వాడుకుంటారని సంచలన వ్యాఖ్యలు చేసింది. తనకు భద్రత కల్పిస్తే… టాలీవుడ్ లో డ్రగ్స్ తీసుకునే వారి పేర్లను బయటపెడతానని చెప్పింది.

Loading...