Tuesday, April 23, 2024
- Advertisement -

మిస్టర్ కూల్ కి కోపం ఎందుకు వచ్చింది.. ?

- Advertisement -

బిగ్ బాస్ ఇంట్లో మిస్టర్ కూల్ అంటే ఎవరో ఎవరికీ చెప్పనక్కర్లేదు. గ్రూప్స్ అయిపోయారు అన్నప్పుడు ఎంత కూల్ గా ఉన్నాడో, చెత్త రీజన్స్ తో నామినేట్ చేసినప్పుడు కూడా అంతే కూల్ గా ఉన్నాడు. అందరూ లోపలికి కంటెస్టెంట్ లాగా వెళుతుంటే వరుణ్ మాత్రం ఒక కంటెస్టెంట్ ప్లేస్ భర్త కూడా, సో ఎంత లాభమో ఆలోచిస్తే అంత నష్టం కూడా కనపడుతుంది.

వితిక వరుణ్ వీరిద్దరు భార్యాభర్తలు… బిగ్ బాస్ సమీకరణాలను మారుస్తూ మొదటిసారిగా కపుల్ గా లోపలికి పంపారు వీళ్ళని. విడివిడిగా చూస్తే వితిక.. మన తెలుగు అమ్మాయి, భర్తని బాగా చూసుకునే అమ్మాయి, భర్త ఆనందమే తన ఆనందం అనుకునే అమ్మాయి. వరుణ్ ఐడియల్ హస్బెండ్.. వితిక చెప్పకముందే తనకి ఏం జరిగిందో తెలుసుకుని కరెక్ట్ చేసే భర్త. వీరిద్దరూ ఒక గేమ్ ఆడడానికి వెళ్ళారు బాగా ఆడుతున్నారు, ముందు వచ్చిన చెడ్డపేరు తుడుచుకుపొయ్యేలా ఆడుతున్నారు.

కానీ సమీకరణాలు మారుతున్నాయి. ఫైనల్స్ దగ్గరపడుతుంటే అందరి మనోభావాలు బయటపడుతున్నాయి. ఇప్పుడు ఇంటి కెప్టెన్ గా వితిక ఉంది. నిన్న జరిగిన టాస్క్ లో శ్రీముఖి కి వరుణ్ కి కొంచెం గట్టిగానే గొడవ అయ్యింది. ఎన్నో రోజుల బట్టి లోపల దాచుకున్న కోపాన్ని అంతా నిన్న అనేసాడు వరుణ్. సాధారణంగా ఎవరికైనా నిజానిజాలు సర్దిచెప్పే వరుణ్ కి అంత కోపం రావడానికి కారణం శ్రీముఖి ఓవర్ యాక్షన్. ఏదో అనాలసిస్ చేసినట్టు మాట్లాడి మొదటి నుండి అందరికీ తలనొప్పిని క్రియేట్ చేస్తున్న శ్రీముఖి కి గట్టి షాక్ ఇచ్చాడు వరుణ్.
నీ మాటే నెగ్గాలి అనుకోవడం తప్పు అని వరుణ్ చెప్తుంటే దాన్ని తీసుకోలేకపోయింది శ్రీముఖి, ఏడ్చింది కూడా. కానీ మన మిస్టర్ కూల్ మళ్ళీ కూల్ గా డీల్ చేస్తూ సోరీ చెప్పాడు.

ఒకసారి రోహిణీ దగ్గర, తరువాత నోరుజారి బాబా మాస్టర్ దగ్గర, ఇప్పుడు వరుణ్ దగ్గర ఎన్నిసార్లు జరిగిన శ్రీముఖి నోరు అదుపులో పెట్టకోవట్లేదు. అలీ కూడా ఇలాంటి బిహెవియర్ తోనే ఎలిమినేట్ అయిపోయాడు అనేది శ్రీముఖి కి గుర్తులేదేమో.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -