Thursday, April 25, 2024
- Advertisement -

క్రిష్ ఫెయిల్యురా ? లేక బాల‌కృష్ణ అధిప‌త్యమా…?

- Advertisement -

క్రిష్ …. తీసింది త‌క్కువ సినిమాలే అయిన త‌న‌కంటు ప్ర‌త్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు. గ‌మ్యం సినిమాతో కెరీర్‌ను మొద‌లుపెట్టిన క్రిష్ మొద‌టి సినిమాతోనే తాను ఏంటో నిరుపించుకున్నాడు. ఈ సినిమాతో విమ‌ర్శ‌కుల ప్ర‌శంసలు అందుకున్నాడు. అయితే గ‌మ్యం సినిమా క‌మర్షియ‌ల్‌గా స‌క్సెస్ కాలేదు. రెండో సినిమా కూడా ఇదే దారి. క్రిష్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన వేదం సినిమా కూడా బాగుంద‌ని చెప్పిన‌ప్ప‌టికి, ఈ సినిమా కూడా విజ‌యం సాధించ‌లేదు.

తాజాగా క్రిష్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన ఎన్టీఆర్ బ‌యోపిక్‌ది కూడా ఇదే దారి. భారీ అంచ‌నాల మధ్య విడుద‌లైంది ఈ సినిమా. తెలుగు వెండితెర దైవంగా భావించే ఎన్టీఆర్ జీవిత క‌థ‌ అంటే ఎలా ఉంటుందో అని ఆతృత అంద‌రిలోను ఉంటుంది. కాని సినిమా చూసిన ప్రేక్ష‌కులు బ‌య‌టికి వ‌చ్చిన త‌రువాత సినిమా బాగానే ఉంద‌ని చెబుతున్నారు , కాని అద్భుతంగా ఉంద‌ని మాత్రం ఎవ‌రు చెప్ప‌డం లేదు. క్రిష్ గొప్ప దర్శ‌కుడు అన‌డంలో ఎటువంటి సందేహం లేదు. క‌థ‌లో కొన్ని సీన్ల‌ను చాలా బ‌లంగా రాసుకుంటాడు క్రిష్. బ‌లంగా రాసుకున్న సీన్ల‌ను చెప్పి హీరోల‌తో సినిమాలను ఓకే చేయించుకుంటాడు క్రిష్‌.

అయితే ఎన్టీఆర్ బ‌యోపిక్ అంటే అద్బుతంగా ఉండాలి.కాని సినిమా అలా లేద‌నే టాక్ వినిపిస్తుంది. కొన్ని సీన్లను అద్భుతంగా తెర‌కెక్కించిన క్రిష్‌, కొన్ని సీన్ల‌ను మాత్రం డ్రామాలో వ‌చ్చి వెళ్లిన‌ట్లుగా తీశాడు. బాల‌య్య కృష్ణుడు గెట‌ప్‌లో వ‌చ్చిన సీన్ లాంటివి మరో రెండు ప‌డి ఉంటే .. సినిమా ఎక్క‌డికో వెళ్లేదనే అభిప్రాయం వెల్ల‌డ‌వుతోంది. అయితే ఈ విష‌యంలో క్రిష్‌ను నిందించ‌డానికి లేదు. ఎందుకంటే క్రిష్ ఈ సినిమాకు మ‌ధ్య‌లో వ‌చ్చి చేరాడు. మొద‌ట ఎన్టీఆర్ బ‌యోపిక్‌కు తేజ ద‌ర్శ‌క‌త్వం వ‌హించాడు. బాల‌య్య‌తో విభేదాలు రావ‌డంతో సినిమా నుంచి త‌ప్పుకున్నాడు తేజ‌.

దీంతో క్రిష్‌ను బ‌ల‌వంతంగా ఈ సినిమాకు ఒప్పించాల్సి వ‌చ్చింది బాలయ్య‌. ఈ సినిమా కోసం బాలీవుడ్ మ‌ణికర్ణిక సినిమాను మ‌ధ్య‌లోనే వ‌దిలేశాడు క్రిష్‌. క్రిష్‌కు త‌గినంత స‌మ‌యం ఇచ్చి ఉంటే సినిమా ఎలా ఉండేదో తెలిసేది. ఏది ఏమైన‌ప్ప‌టికి సినిమా మాత్రం అనుకున్నంత లేద‌ననే అభిప్రాయం వెల్ల‌డ‌వుతోంది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -