Thursday, March 28, 2024
- Advertisement -

నాగ శౌర్య ని ఇగ్నోర్ చేసిన బేబీ?

- Advertisement -

అక్కినేని సమంత త్వరలో ఓ బేబీ అనే సినిమా తో మన ముందుకు వస్తుంది అని ప్రేక్షకులు ఎంతగానో ఎదురు చూసారు. ఎట్టకేలకు ఈ సినిమా రేపు విడుదల కావడం తో అందరూ ఎంతగానో సంతోషం గా ఉన్నారు. అయితే ఆసక్తికరమైన అంశాల ఏంటి అంటే ఈ సినిమా ప్రమోషన్స్ ని సినిమా యూనిట్ దాదాపు నెల రోజుల ముందే మొదలు పెట్టింది. అయితే సమంత ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకొని ఈ సినిమా ని బాగా ప్రమోట్ చేసింది. నందిని రెడ్డి దర్శకత్వం లో సురేష్ ప్రొడక్షన్స్ సపోర్ట్ తో ఈ సినిమా విడుదల అవుతుంది.

అయితే నాగ శౌర్య ఈ సినిమా లో ఒక ముఖ్య పాత్ర పోషిస్తున్నాడు. తన పాత్ర నిడివి తక్కువే అయినప్పటికీ నాగ శౌర్య సినిమా లో ఉన్నాడు అనే అంశం కొంత పాజిటివ్ బజ్ తీసుకొని వస్తుంది. అలాంటిది చిత్ర యూనిట్ అసలు నాగ శౌర్య ని ప్రమోషన్స్ లో సరిగా వాడుకోలేదు. క్యారెక్టర్ ఆర్టిస్ట్ రాజేంద్ర ప్రసాద్ ప్రత్యేక ఇంటర్వూస్ ఇస్తున్నారు కానీ గాయం నుండి కోలుకొని ఈ రోజు షూటింగ్ మొదలు పెట్టిన శౌర్య తో ఒక్క ఇంటర్వ్యూ కూడా చిత్ర యూనిట్ ఇప్పించకపోవడం చర్చనీయాంశం అవుతుంది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -