Wednesday, April 24, 2024
- Advertisement -

అక్కినేని ఫ్యామిలీ ఎందుకంత వెనుకపడిపోయింది..?

- Advertisement -

యువ సామ్రాట్ నాగార్జున గారికి పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలుపుతూ ఈ కథనాన్ని ప్రారంభిద్దాం.. అక్కినేని నాగేశ్వర రావు వారసుడిగా నాగార్జున టాలీవుడ్ అరంగేట్రం చేస్తూ ఎన్ని మంచి మంచి సినిమాలను అందించారు.. మాస్ చిత్రాలకు , భక్తి చిత్రాలకు పెట్టింది పేరుగా నాగార్జున ఎందరో అభిమానులను చాటుకున్నారు. ఇక్కడ ఇగో లు అవసరం లేదని తన కన్నా చిన్న హీరో లతో సినిమా చేసిన నాగార్జున గత కొన్ని రోజులుగా మంచి సినిమాలు చేయట్లేదని ఓ వాదన వినిపిస్తుంది.. ఇటీవలే కాలంలో ఆయన చేసిన ఓ మంచి చిత్రం ఏదంటే కొంచెం అలోచించి సోగ్గాడే చిన్ని నాయన అని చెప్పొచ్చు..

ఇతర సీనియర్ లు దూసుకుపోతున్న తరుణంలో నాగార్జున కొన్ని పిచ్చి పిచ్చి సినిమా లు చేసి ఇమేజ్ కోల్పోవడం అక్కినేని అభిమానులకు నచ్చడంలేదు..ఇక వారసుల సంగతి సరే సరి.. నాగ చైతన్య పర్వాలేదనిపించుకున్నా ఇండస్ట్రీ కి వచ్చి దాదాపు పదేళ్లు అవుతున్నా ఇంకా చిన్న స్థాయి హీరో గా నే మిగిలిపోయాడు.. మాస్ జనాలకు చైతన్య యాక్టింగ్ ఎక్కకపోవడం పెద్ద మైనస్.. ఒకే రకం సినిమా చేస్తూ బోర్ కొట్టిస్తున్నాడన్నది ప్రేక్షకుల మాట.. సమంత ని పెళ్లి చేసుకున్నాక అయినా మారతాడా అనుకుంటే అదీ లేదు..

ఇక రెండో అబ్బాయి అఖిల్ పరిస్థితి ఎలా చెప్పాలో కూడా అర్థం కావట్లేదు.. ఎన్నో అంచనాలతో ఈ సిసింద్రీ ని టాలీవుడ్ కి పరిచయం చేసిన నాగార్జున కు ఆశించిన స్థాయిలో అఖిల్ కి పేరు రాలేదని అర్థమయిపోయింది.. దాంతో రెండు సినిమా తో హిట్ కొట్టాలని ట్రై చేస్తే అది బెడిసి కొట్టింది.. మూడో సినిమా ఎప్పుడు వచ్చిందో ఎప్పుడు ఫ్లాప్ అయ్యిందో కూడా తెలీదు.. నాల్గో సినిమా అయినా అఖిల్ కి బ్రేక్ ఇవ్వాలని కోరుకుండా.. ఇతర హీరో ల వారసులు ఎలా దూసుకుపోతున్నారో చేసి అక్కినేని అభిమానులు లోలోపల కుమిలిపోతున్న తమ హీరో లకు ఎందుకు పడట్లేదు, ఎందుకు ఇమేజ్ పెరగట్లేదని వారి ఆవేదన.. విజయ్ దేవరకొండ, విశ్వక్ సేన్, సత్యదేవ్ లాంటి యువ హీరోలు ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా వచ్చి స్టార్ ఇమేజ్ తెచ్చుకుంటుంటే స్టార్ హీరోల వంశంలో పుట్టి ఎందుకు ప్రజల్లో ఆ క్రేజ్ తెచ్చుకోలేకపోతున్నారని వారు ఎంతో ఆవేదన చెందుతున్నారు..

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -