Thursday, April 18, 2024
- Advertisement -

సాహో విషయంలో రాజమౌళి సైలెన్స్ అందుకేనా?

- Advertisement -

అప్పటిదాకా తెలుగు రాష్ట్రాల్లోనే క్రేజ్ ఉన్న ప్రభాస్ కి ‘బాహుబలి’ సినిమా తర్వాత ప్రపంచవ్యాప్తంగా ఫ్యాన్ ఫాలోయింగ్ ఏర్పడింది. ఈ సినిమా అతి పెద్ద బ్లాక్బస్టర్ అవ్వడం తో తన తదుపరి సినిమా ‘సాహో’ కి కూడా మంచి ఓపెనింగ్స్ లభిస్తాయని తెలిసిందే. ఈమధ్యే విడుదలైన ఈ సినిమా ట్రైలర్ కు ప్రేక్షకుల నుంచి విపరీతమైన పాజిటివ్ రెస్పాన్స్ అందుతుంది. అయితే ఈ ట్రైలర్ గురించి రాజమౌళి మాత్రం ఒక్క కామెంట్ కూడా చేయకపోవడం అందరి దృష్టిని ఆకర్షిస్తుంది. తాజా సమాచారం ప్రకారం ట్రైలర్ చూసిన తర్వాత రాజమౌళి స్వయంగా ప్రభాస్ కి నీ అభినందించాలని కానీ ట్విట్టర్ లో మాత్రం ఎలాంటి పోస్టులు చేయలేదని తెలుస్తోంది.

ఏదైనా సినిమా నచ్చినా ట్రైలర్ బాగుందని అనిపించినా వెంటనే ట్విట్టర్ ద్వారా పంచుకొనే రాజమౌళి ‘బాహుబలి’ సినిమా కోసం తన కెరీర్ లో ఐదేళ్లు వెచ్చించిన ప్రభాస్ సినిమా కోసం కనీసం రెండు నిమిషాలు కూడా వెచ్చించలేకపోవడం మీద అందరూ సందేహ పడుతున్నారు. అయితే నిజానికి ‘బాహుబలి’ సినిమా బ్లాక్బస్టర్ తర్వాత రాజమౌళి పైన ప్రెజర్ బాగా పెరిగిందని చెప్పవచ్చు. ‘ఆర్ఆర్ఆర్’ సినిమా పైన అంచనాలు భారీగా నెలకొనడంతో వాటిని అందుకునే దిశగా రాజమౌళి రాత్రింబవళ్ళు కష్టపడుతున్నారు. ఈ మధ్య కాలంలో సోషల్ మీడియాలో కూడా పెద్దగా కనిపించటం లేదు. ఈ నేపథ్యంలోనే రాజమౌళి సాహో ట్రైలర్ పై ఇంకా రియాక్ట్ అవలేదు అని తెలుస్తోంది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -