Friday, April 19, 2024
- Advertisement -

కాపీ అంటే చాలు త్రివిక్రమ్ గుర్తొస్తాడు??

- Advertisement -

టాలీవుడ్ లో ప్రస్తుతం కాపీకథల ఆరోపనలు చాలా ఎక్కువగా వస్తున్నాయి.. గతంలో ఎప్పుడో కానీ రాణి ఈ ఆరోపణలు ఇప్పుతూ సినిమా సినిమా కి వస్తుండడంతో టాలీవుడ్ లో కథ కొరత ఏర్పడుతుందని స్పష్టంగా తెలుస్తుంది.. ఈ కాపీ కథల విషయం గతం నుండి తీసుకుంటే మగధిర విషయంలో ఇలానే ఓ వ్యక్తి యా కథ నాదే అని హల్చల్ చేశాడు..

ఆ తర్వాత ఎక్కువ త్రివిక్రమ్ సినిమా లకే ఈ ఆరోపణలు వచ్చాయి.. త్రివిక్రమ్ తన సినిమాలను ఏదో ఒక బుక్ లోంచి కాపీ చేసి ప్రస్తుతం ట్రెండ్ కి, హీరో కి ఉన్న ఫాలోయింగ్ కి కలిపి సినిమా తీసి హిట్ కొడతాడని ఇండస్ట్రీ లో ఒక టాక్ నడుస్తుంది.. అది ఎంతవరకు నిజమో తెలీదు కానీ త్రివిక్రమ్ సినిమా లలో పంచులకు చాలామంది ఫాన్స్ ఉన్నారు. అయితే ఈ కాపీ ఆరోపణలు పదే పదే రావడంతో త్రివిక్రమ్ పై సహజంగానే అందరిలోనూ అనుమానాలు రావడం మొదలయ్యింది.

ఇక నితిన్ తో తీసిన ‘అ ఆ’ విషయంలో త్రివిక్రమ్ అడ్డంగా దొరికిపోయాడు, ముఖ్యంగా అరవింద సమేత విషయంలో ప్రేక్షకులకు లైవ్ లో దొరికాడు.. దాంతో త్రివిక్రమ్ అంటే కేరాఫ్ కాపీ అన్న స్టేజి కి వచ్చేశాడు ఈ మాటల మాంత్రికుడు.. రచయితగా ఓ రేంజ్ స్టేజ్ ఉన్న త్రివిక్రమ్ ఇలా కాపీ సమస్యల్లో ఇరుక్కోవడం టాలీవుడ్ కి తలవంపులు.. ఇక తాజాగా సుకుమార్, కొరటాల శివ లు కూడా ఈ వివాదానికి ఏం అతీతులు కారని తేలిపోయింది.. వారు తీస్తున్న లేటెస్ట్ సినిమా కథలు తనవే అంటూ ఓ రైటర్ హడావుడి చేయడంతో టాలీవుడ్ లో ఎన్నడు లేనిది ఈ కాపీ కథల గోలేంటి అన్నట్లు ప్రేక్షకులు పెదవి విరుస్తున్నారు.. ఏదేమైనా ఇంకోసారి డైరెక్టర్ లు ఈ కాపీ అనే మారక తమ మీద పడకుండా చూసుకోవడం వారికే మంచిది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -