Friday, March 29, 2024
- Advertisement -

సాహో వేడుక కి అనుష్క వస్తుందా?

- Advertisement -

ఇప్పటి అనేక మార్లు తాము ఎటువంటి రిలేషన్ లో లేము అని కుండ బద్దలు కొట్టినట్టు చెప్పారు అనుష్క మరియు ప్రభాస్. వీరు కలిసి నటించిన సినిమాలు బాగా ఆడటం, వీరి కెమిస్ట్రీ కి మంచి పేరు రావడం తో అంతా ఎంతో సంతోషించారు. చాలా కలం మీడియా లో వీరు పెళ్ళి చేసుకోనున్నారు అనే వార్తలు కూడా వచ్చాయి. అయితే ప్రభాస్ ప్రస్తుతం సాహో ప్రమోషన్స్ లో బిజీ గా ఉన్న నేపథ్యం లో అనేక మంది మీడియా వాళ్ళతో ప్రభాస్ ముచ్చటించడం జరుగుతుంది. ఈ సందర్భం గా అనేక మంది ప్రభాస్ ని అనుష్క తో రిలేషన్ గురించి అడుగుతున్న తీరు హీరో ని ఇబ్బంది పెట్టేలా చేస్తుంది.

అయితే ప్రభాస్ నటించిన సాహో సినిమా కి సంబందించిన ప్రీ రిలీజ్ ఈవెంట్ రేపు రామోజీ ఫిలిం సిటీ లో జరగున్న నేపథ్యం లో ముఖ్య అతిధులు గా ఎవరు వస్తారు అనే విషయం పై క్లారిటీ లేకుండా పోయింది. అయితే ప్రభాస్ ఈ వేడుక కి అనుష్క కోసం ప్రత్యేక ఆహ్వానం పంపాడని, అనుష్క వస్తుందా లేదా అనే ఆసక్తి ని మాత్రం మీడియా ఒక రేంజ్ లో క్రియేట్ చేస్తుంది. మరి అనుష్క వస్తుందో రావట్లేదా అనే విషయం తెలుసుకోవాలంటే మరి కొన్ని గంటలు ఆగాల్సిందే.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -