Friday, March 29, 2024
- Advertisement -

సుధీర్ మనసులో మాట..?మహేష్ తో …

- Advertisement -

టాలీవుడ్ లో మొదలైన మంచి ట్రెండ్ ఏంటంటే స్టార్ హీరో లు మల్టీ స్టారర్ సినిమాలు చేయడం.. గతంలో స్టార్ హీరో లు ఇతర హీరోల సినిమా లు చూడడానికి కూడా ఇష్టపడేవారు కాదని ఓ గాసిప్ వినపడింది.. అయితే అది ఇప్పుడు అప్రస్తుతం.. అలాంటి పరిస్థితి నుంచి మరొక హీరో తో కలిసి సినిమా చేయాలనీ హీరోలకు ఆలోచన రావడం టాలీవుడ్ కి శుభ పరిణామం.. చిన్న చితక హీరోలు మల్టీ స్టారర్ సినిమా లు చేసినా అవి కామెడీ సబ్జేక్ట్ లు, హారర్ సబ్జెక్ట్ లు కావడంతో వాటిని అసలు మల్టి స్టారర్ సినిమాలు అనడం వేస్ట్..

పెద్ద హీరోలు కమర్షియల్ సినిమా లు చేస్తే అదీ మల్టీ స్టారర్ చేస్తే చూడాలన్నది అభిమానుల కోరిక. అలా అభిమానుల కోరికను వెంకటేష్, మహేష్ బాబుల రూపంలో దిల్ రాజు తీర్చాడు.. సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు రూపంలో దర్శకుడు శ్రీకాంత్ అడ్డాల ఈ ముల్టీ స్టారర్ సినిమాలకు శ్రీకారం చుట్టారు.. ఇక అప్పటినుంచి సీనియర్ హీరోలైన నాగార్జున, బాలకృష్ణ లు మల్టి స్టారర్ సినిమాల్లో నటించడం మొదలుపెట్టారు.. నాని తో నాగార్జున దేవదాస్, మనోజ్ తో బాలకృష్ణ ఇలా మల్టి స్టారర్ సినిమా లు చేసి కొత్త ట్రెండ్ ను సృష్టించారు.. ఇక రామ్ వెంకటేష్ మసాలా, నాగ చైతన్య తో వెంకీ మామ వంటి సినిమా లు మంచి హిట్ సినిమాలు గా నిలిచాయి..

ఇక ప్రస్తుతం రాజమౌళి RRR సినిమా సెన్సేషన్ అయ్యింది.. ఇద్దరు యంగ్ టాప్ స్టార్ హీరోలు అయిన రామ్ చరణ్, ఎన్టీఆర్ లు ఈ సినిమా లో నటించడం ఈ సినిమాకు పెద్ద అసెట్ కాగ రాజమౌళి లాంటి పాన్ ఇండియా డైరెక్టర్ దర్శకత్వం వహించడం కొసమెరుపు.. ఇక ఈ సినిమా తో టాలీవుడ్ రేంజ్ హాలీవుడ్ రేంజ్ కి వెళ్ళడం ఖాయం అంటున్నారు.. ఇక ఈ సినిమా తర్వాత మరో మల్టి స్టారర్ సినిమా ప్రకటన అందరిలో ఉర్రుతలూగిస్తుంది.. అదే మహేష్, సుధీర్ బాబు ల సినిమా.. ఇటీవలే సుదీర్ బాబు ఓ ఇంటర్వ్యూలో ప్రిన్స్ మహేష్ బాబు చిత్రంలో నటించే అవకాశం ఉందా అని అడిగితే.. సరైన పాత్ర దొరికితే ఖచ్చితంగా నటిస్తానని సమాధానమిచ్చారు. మహేష్ ను నేను అడిగితే కచ్చితంగా తన సినిమాలో అవకాశం ఇస్తారని, కానీ నేను చేసే పాత్ర సినిమాకి వన్నె తెచ్చే విధంగా ఉండాలని కోరుకుంటున్నాను.. అందుకే ఇప్పటి వరకు మహేష్ బాబు ను తన సినిమాలో పాత్ర గురించి అడగలేదని సమాధానమిచ్చారు. మరి సుధీర్ కోరిక మహేష్ తీరుస్తాడో చూడాలి..

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -