Saturday, April 20, 2024
- Advertisement -

సాహో లాగానే సైరా సినిమా కూడా అవుతుందా

- Advertisement -

బాహుబలి తర్వాత అదే రేంజ్ లో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ‘సాహో’ సినిమా విడుదలైన అయినప్పటికీ సినిమాకి ప్రేక్షకుల నుంచి మిక్స్డ్ రెస్పాన్స్ మాత్రమే వస్తుంది. ‘బాహుబలి’, ‘కేజిఎఫ్’ వంటి భారీ బడ్జెట్ చిత్రాలు బ్లాక్ బస్టర్ అయినప్పటికీ ప్రతి భారీ బడ్జెట్ సినిమా హిట్ అవ్వదు అని సాహో సినిమాకి వచ్చిన రెస్పాన్స్ చూస్తేనే తెలుస్తోంది. అయితే సాహో సినిమా రిజల్ట్ చూసి అభిమానులు ఇప్పుడు మెగాస్టార్ చిరంజీవి హీరోగా త్వరలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ‘సైరా నరసింహారెడ్డి’ సినిమా సందేహాలను వ్యక్తం చేస్తున్నారు.

‘సాహో’ లాగానే ‘సైరా’ సినిమా కూడా భారీ బడ్జెట్ తో ప్యాన్ ఇండియన్ అప్పీల్ తో విడుదలకు సిద్ధమవుతోంది. తెలుగులో మాత్రమే కాక హిందీ, తమిళం, మలయాళం భాషల్లో కూడా సైరా సినిమా విడుదల కాబోతోంది. ఎక్సెల్ ఫిలిమ్స్ నుంచి ఫర్హాన్ అక్తర్ మరియు రితేష్ సిద్వాని ఈ సినిమా బాలీవుడ్ రైట్స్ ని సొంతం చేసుకున్నారు. అయితే ‘సాహో’ సినిమా రిజల్ట్ చూసి సినిమాకి ఎలాంటి ఫలితం దక్కుతుంది అని అభిమానులు కంగారు పడుతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. మరి ‘సైరా’ సినిమా కేజిఎఫ్ లాగా హిందీలో కూడా బ్లాక్ బస్టర్ గా నిలుస్తుందా లేదా అని తెలియాలంటే అక్టోబర్ 2 దాకా ఎదురు చూడాల్సిందే.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -