Thursday, April 18, 2024
- Advertisement -

ఇక సాహో మీద బజ్ పడిపోనుందా?

- Advertisement -

ప్రభాస్ మరియు శ్రద్ధ కపూర్ జంటగా నటించిన సినిమా సాహో. ఈ సినిమా ఆగస్టు 30 న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అంటే ఈ రోజుకి ఈ సినిమా విడుదల అయ్యి సరిగ్గా వారం రోజులు అవుతుంది అన్న మాట. అయితే ఈ సినిమా మొదటి రోజు విడుదల అయ్యే సమయానికి పెద్ద గా పాజిటివ్ టాక్ లేదు కానీ క్రమక్రమం గా ఈ సినిమా కి ఇప్పుడు మంచి టాక్ వస్తుంది.

కాకపోతే సెలవ రోజుల్లో ఈ సినిమా బాగానే వసూలు చేసినా కానీ ఇప్పుడు మాత్రం ఈ సినిమా అంతంత మాత్రం గా నే వసూలు చేస్తుంది అనేది సమాచారం. ఇకపోతే ఈ సినిమా తెలుగు రాష్ట్రాల్లో సాధారణం గా సాగుతుంది. కొన్ని ఏరియాల్లో సాహో సినిమా కంటే టైర్ 2 హీరోల సినిమాలకె మొదటి వారం లో ఎక్కువ వసూళ్లు రావడం గమనార్హం.

అయితే ప్రస్తుతం ఈ సినిమా ని తమ శాయశక్తులా ప్రమోట్ చేసిన ఫిలిం యూనిట్ ఇక రిలాక్స్ అవుదాం అని నిర్ణయించుకున్నట్లు తెలుస్తుంది. ప్రభాస్ కూడా ఇంస్టాగ్రామ్ లో అభిమానులకి ధన్యవాదాలు తెలపడం తో పాటు గా సుజీత్ కూడా ఒక తెలుగు దినపత్రిక కి ఇంటర్వ్యూ ఇచ్చాడు. ఇక మెల్లగా ఈ సినిమా మీద బజ్ తగ్గిపోతుంది అనడం లో ఏ మాత్రం అతిశయోక్తి లేదు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -