Friday, April 19, 2024
- Advertisement -

విజయ్ దేవరకొండ కి తప్పని ‘అర్జున్ రెడ్డి’ చిక్కులు

- Advertisement -

విజయ్ దేవరకొండ హీరో గా నటించిన చిత్రం అర్జున్ రెడ్డి. సందీప్ రెడ్డి వంగ అనే కొత్త దర్శకుడు ఈ సినిమా తో ఇండస్ట్రీ కి పరిచయం అయ్యారు. ఈ సినిమా విజయం ఒక్కసారిగా తెలుగు సినిమా పరిశ్రమ ని ఊపేసింది అని చెప్పొచ్చు. ఈ సినిమా ఎంత పెద్ద విజయం సాధించింది అంటే, విజయ్ దేవరకొండ ఇక పై కెరీర్ లో తిరిగి చూసుకోవాల్సిన పరిస్థితి లేకుండా చేసింది. విజయ్ కి సందీప్ కి ఈ సినిమా విజయం చాలా బాగా ఉపయోగపడింది. అయితే అర్జున్ రెడ్డి విజయ్ దేవరకొండ కి ఎంత మేలు చేసిందో అంతే కీడు కూడా చేస్తుంది.

అర్జున్ రెడ్డి తర్వాత విజయ్ ఆ పాత్ర నుంచి బయటకి రావడానికి వేరే సినిమాలు చేసినా కానీ విజయ్ ని అర్జున్ రెడ్డి లాగా నే క్రిటిక్స్ మరియు ప్రేక్షకులు చూడసాగారు. మొన్నామధ్య వచ్చిన చిత్రం డియర్ కామ్రేడ్ లో విజయ్ పాత్ర ని కూడా అర్జున్ రెడ్డి తో పోల్చారు. అయితే ఇప్పుడు తాజాగా వరల్డ్ ఫేమస్ లవర్ అనే విజయ్ కొత్త చిత్రానికి సంబందించిన ఫస్ట్ లుక్ బయటకి రాగా, ఆ పోస్టర్ ని చూసి చాలా మంది అర్జున్ రెడ్డి తో కంపేర్ చేయడం మొదలు పెట్టారు.

విజయ్ దేవరకొండ పాత్ర అర్జున్ రెడ్డి తరహా లో ఉండే అవకాశం ఉంది అన్నట్లు గా వార్తలు కూడా వస్తుండటం తో మరొక లుక్ వచ్చే వరకు విజయ్ కి ఈ అర్జున్ రెడ్డి చిక్కులు తప్పేలా లేవు.

https://www.youtube.com/watch?v=FoEAbFBR-Uo

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -