Wednesday, April 24, 2024
- Advertisement -

వరల్డ్ ఫేమస్ లవర్ ట్రైలర్.. ఇది గమనించారా ?

- Advertisement -

‘డియర్ కామ్రేడ్’ సినిమా ప్లాప్ తర్వాత విజయ దేవరకొండ నుంచి వస్తున్న మూవీ ‘వరల్డ్ ఫేమస్ లవర్’. క్రాంతి మాధవ్ డైరెక్షన్ లో తెరకెక్కిన ఈ సినిమా ఫిబ్రవరి 14న వ్యాలెంటైన్స్ డే కానుకగా రిలీజ్ కానుంది. ’క్రియేటివ్ కమర్శియల్స్’ బ్యానర్ పై క్ ఎస్ రామారావు అలానే కే ఏ వల్లభ కలిసి ఈ సినిమాని నిర్మిస్తున్నారు. రాశీ ఖన్నా, కేథరిన్, ఐశ్వర్య రాజేష్ వంటి క్రేజీ భామలు ఈ మూవీలో హీరోయిన్స్ గా చేస్తున్నారు.

ఇక ముందుగా రిలీజ్ చేసిన టీజర్ పర్వాలేదు అనిపించగా.. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన టీజర్ ను రిలీజ్ చేశారు. ఈ టీజర్ ’ఈ ప్రపంచంలో నిస్వార్ధమైంది ఏదైనా ఉందంటే అది ప్రేమ మాత్రమే’ అంటూ విజయ్ చెప్పే డైలాగ్ తో మొదలవుతుంది. అయితే ‘ఆ ప్రేమలో కూడా నేను అనే రెండక్షరాలు ఓ సునామీనే రేపగలవు’ అనే డైలాగ్ తో అసలు కథ ఏంటనేది హింట్ ఇచ్చినట్టు అర్దం అవుతోంది.

ట్రైలర్ మొత్తం నలుగురు హీరోయిన్లతో రొమాంటిక్ సన్నివేశాలతో నింపినప్పటికీ.. బలమైన ఎమోషన్ కూడా కథలో ఉంటుందేమో అని ఫీలింగ్ కలుగుతోంది. గోపిసుందర్ అందించిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అలాగే జయకృష్ణ గుమ్మడి అందించిన విజువల్స్ ఆకట్టుకునే విధంగా ఉన్నాయి. మొత్తంగా ట్రైలర్ బాగుంది. ఈ సినిమా తో విజయ్ ఏ స్థాయి హిట్ కొడుతాడో చూడాలి. మీరు కూడా ట్రైలర్ ను చూసేయండి.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -