Thursday, April 25, 2024
- Advertisement -

లుక్ మార్చిన ‘కే జి ఎఫ్’ స్టార్

- Advertisement -

కన్నడ రాకింగ్ స్టార్ యష్ ‘కే జి ఎఫ్ చాప్టర్ 1’ సినిమాతో దేశవ్యాప్తంగా మంచి పేరు తెచ్చుకున్నాడు. ఇక ప్రస్తుతం కేవలం కన్నడ ప్రేక్షకులు మాత్రమే కాక మిగతా రాష్ట్రాల వారు కూడా ఆసక్తిగా ఎదురు చూస్తున్న సినిమా ‘కెజీఎఫ్ చాప్టర్-2’. ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ‘కే జి ఎఫ్’ సిరీస్ లోని ఆఖరి భాగమైన ‘కె జి ఎఫ్ చాప్టర్-2’ సినిమాపై భారీ అంచనాలు ఉన్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈ చిత్ర షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. తాజాగా యశ్ ఫోటో ఒకటి సోషల్ మీడియాలో ఇప్పుడు హల్ చల్ చేస్తోంది. గుబురు గడ్డంతో ఉన్న యశ్ సూట్ లో చాలా హ్యాండ్ సమ్ గా కనిపిస్తున్నాడు.

ఇక సినిమాలో కూడా ఇదే లుక్కుతో కనిపిస్తాడని వార్తలు బయటకు వస్తున్నాయి. మొదటి భాగంలో లో పొడుగు అయిన పొడవాటి జుట్టుతో ఇలా కనిపించాడు కాబట్టి కంటిన్యుటి బాగుండాలంటే రెండవ భాగంలో కూడా అలానే కనిపించాలి. కానీ మొదటి భాగంలో రౌడీ రాకీ భాయ్ లా కనిపించిన టాస్ రెండవ భాగంలో రాయల్ గా మరియు స్టైలిష్ లుక్ తో కనిపిస్తున్నాడు. మొదటి భాగం కంటే రెండవ భాగం ఇంకా పెద్ద హిట్ అవుతుందని ట్రేడ్ వర్గాలు కూడా విశ్లేషిస్తున్నాయి.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -