Friday, March 29, 2024
- Advertisement -

దేహాకృతి కోసం యంగ్‌టైగ‌ర్ భారీగా ఖ‌ర్చు

- Advertisement -

త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో రూపొందే సినిమా కోసం యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్ ప్ర‌త్యేక శ్ర‌ద్ధ పెట్టాడు. దీనికోసం క‌స‌ర‌త్తు తీవ్రంగా చేస్తున్నాడు. అయితే ఈ సినిమా కోసం ఎన్టీఆర్ స్లిమ్‌గా త‌యారై యంగ్ లుక్‌లో క‌నిపించేందుకు క‌ష్ట‌ప‌డుతున్నాడు. సినిమా షూటింగ్ ప్రారంభించేలోపు ఓ నెల రోజుల పాటు ప్ర‌త్యేకంగా దేహ ధారుడ్యంపై దృష్టి సారిస్తున్నాడు.

ఈ సినిమాలో న‌యా ఎన్టీఆర్‌ని చూడ‌బోతున్నారు. దీనికోసం ఎన్టీఆర్ ప్ర‌ముఖ ఫిట్‌నెస్ ట్రైన‌ర్ లాయిడ్ స్టీవెన్ ఆధ్వ‌ర్యంలో ప్ర‌త్యేకంగా క‌స‌ర‌త్తు చేస్తున్నాడు. బాలీవుడ్‌లో లాయిడ్‌ చాలా ఫేమ‌స్‌. అక్క‌డి నుంచి ఎన్టీఆర్ కోసం హైద‌రాబాద్ వ‌చ్చి ఎన్టీఆర్‌కు లాయిడ్ ప్ర‌త్యేక శ్ర‌ద్ధ పెట్టారు. ఆహార నియ‌మాలు… చెబుతూ ఎన్టీఆర్‌ను స‌రికొత్త లుక్‌లో క‌నిపించేందుకు ప్ర‌య‌త్నాలు చేస్తున్నాడు. ఈ నెల 23వ తేదీ నుంచి సినిమా షూటింగ్ ప్రారంభించ‌నుండ‌డంతో ఫిట్‌నెస్‌ను బాగా చేస్తున్నాడు. డైట్‌ను కొన‌సాగిస్తూ కండలు కరిగించడమే కాదు.. వాటిని మెయింటెయిన్ చేయడం కోసం కష్టపడుతున్నాడు.

ఆల్కహాల్‌కు దూర‌మ‌య్యాడు. నెలకు ఒక్కసారి మాత్రమే కోరుకున్న ఆహారం తీసుకోవాలి. ఎగ్ వైట్స్, చికెన్, తాజా ప‌ళ్లు, కూర‌గాయ‌లు బ్రేక్ ఫాస్ట్‌గా తీసుకుంటున్నాడు. స్నాక్స్‌గా ఆల్మండ్స్, వాల్‌న‌ట్స్ మాత్రమే తీసుకుంటున్నాడు. రోస్టెడ్ చికెన్, ఫ్రైడ్ మటన్, ఫిష్‌ను లంచ్, డిన్నర్‌లో తీసుకోవాల‌ని లాయిడ్ స్టీవెన్ నిర్ణ‌యించాడు. ఈ శిక్ష‌ణ కోసం ఏకంగా రూ.6 లక్షలు చెల్లిస్తున్నార‌ని స‌మాచారం. గతంలో ఎన్నడూ చూడని తారక్ ను మనం చూడ్డం ఖాయంగానే కనిపిస్తోంది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -