Thursday, April 25, 2024
- Advertisement -

బాలయ్య, బాబుల కక్కుర్తిపై ఘన విజయం సాధించిన ‘వైస్సార్’

- Advertisement -

సినిమా ఆసాంతం ఆర్థ్రతతో వీక్షించడం………….సినిమా పూర్తయ్యాక కళ్ళలో చెమ్మతో థియేటర్స్ నుంచి బయటకు రావడం లాంటి సంఘటనలు ఈ మధ్య కాలంలో ఎప్పుడైనా చూశారా? కానీ వైఎస్సార్ సినిమా ఆడుతున్న థియేటర్స్ దగ్గర కనిపిస్తున్న దృశ్యం ఇదే. పచ్చ బ్యాచ్ ఫ్రస్ట్రేషన్ పీక్స్‌కి వెళ్ళి సినిమా గురించి ఎంతలా నెగిటివ్ ప్రచారం చేస్తున్నప్పటికీ థియేటర్స్ మాత్రం హౌస్ ఫుల్స్ అవుతున్నాయి. నిన్న నైట్ 10.10 షో జివికె మాల్లో షో ఫుల్ అవ్వడంతో పాటు కొంతమంది టికెట్స్ దొరక్క వెనుదిరిగిన పరిస్థితి. సినిమా గ్లామర్ ఉన్న ఎన్టీఆర్ సినిమాకు కూడా కనిపించని ఈ స్థాయి క్రేజ్ వైఎస్సార్ యాత్రకు ఎందుకు కనిపించింది? కామెడీ లేదు, హీరోయిన్స్ లేరు, స్టార్స్ కూడా పెద్దగా లేరు……….అయినప్పటికీ యాత్ర సినిమాకు ప్రేక్షకులు బ్రహ్మరథం పట్టడానికి కారణం ఏంటి?

చాలా సింపుల్. ఎన్టీఆర్ బయోపిక్ పేరు చెప్పి చంద్రబాబు, బాలయ్యల తండ్రి ఇమేజ్‌ని క్యాష్ చేసుకోవడానికి, అలాగే సినిమా అంతా కూడా అక్కినేని, సావిత్రిలాంటి మహానుభావులను కూడా కించపరుస్తూ ఎన్టీఆర్ గురించి గొప్ప చెప్పడానికి అభూత కల్పనలతో ప్రయత్నాలు చేశారు. అది కాస్తా మరీ ఎక్కువై జనాలు ఛీదరించుకునేలా చేసింది. అయితే వైఎస్సార్ యాత్ర కథ విషయంలో జగన్ సలహాలు కూడా తీసుకుందామని యాత్ర డైరెక్టర్ వెళ్ళి జగన్‌ని కలిసినప్పుడు …….వైఎస్ జగన్ ఒకే ఒక్క మాట చెప్పాడు. ‘నీ నాయకుడి గురించి నువ్వు సినిమా తీస్తున్నావ్. నీకు నచ్చినట్టు తియ్యి………కానీ అబద్ధాలు వద్దు. వైఎస్సార్ చేయనివి చెప్పొద్దు. వైఎస్సార్‌లో లేని గొప్పలు చెప్పకు. వైఎస్సార్ ఏం చేశారో అదే నిజాయితీగా చెప్పు’ అని చెప్పాడు. యాత్ర డైరెక్టర్ ఆ మాటలనే ఇన్‌స్పిరేషన్‌గా తీసుకుని యాత్ర తీశాడు. వైఎస్సార్ ఆత్మను పట్టుకుని నిజాయితీగా కథను చెప్పే ప్రయత్నం చేశాడు. చంద్రబాబును కూడా ఎక్కడా తక్కువ చేస్తూ సీన్స్ ఇరికించలేదు. చంద్రబాబు సొంత మాటలు బ్రీఫ్డ్ మీ వాయిస్‌ని మాత్రమే వాడుకున్నాడు. అది బాబు ఇమేజ్ డ్యామేజ్ చేయడం అని ఫీల్ అయితే నిజ జీవితంలో ఓటుకు నోటు కేసులో బాబు మాటలు తప్పని పచ్చ మీడియా జనాలు ఒప్పుకోవాల్సి వస్తుంది.

వైఎస్సార్ రాజకీయ జీవితంలో, ఇప్పుడు జగన్ జీవితంలో కూడా కాస్త నిజాయితీగా రాజకీయాలు చేయాలన్న ప్రయత్నం అయితే కనిపిస్తూ ఉంటుంది. యాత్ర సినిమాలో కూడా అదే నిజాయితీ కనిపించడంతో తెలుగు ప్రేక్షకులు సినిమాను ఓన్ చేసుకున్నారన్న విశ్లేషణలు వినిపిస్తున్నాయి. చనిపోయి పదేళ్ళయిన తర్వాత కూడా మరోసారి వైఎస్సార్ తెలుగు ప్రజల ప్రేమను గెలుచుకోవడం గొప్ప విషయం అని వైఎస్సార్‌పై మరోసారి అభినందనల వర్షం కురుస్తోంది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -