హత్రాస్ ఘటన మరవకముందే మరో మూడు అత్యాచారాలు.. అసలేం జరుగుతుంది..?

- Advertisement -

దేశంలో ఆడవారిపై జరుగుతున్న హింసాకాండ ఎప్పుడు ఆగుతాయో తెలీట్లేదు.. తాజాగా హత్రాస్ లో జరిగిన అత్యంత క్రూరమైన సంఘటన దేశాన్ని ఒక్కసారిగా కుదిపేసింది చెప్పొచ్చు.. ఒకమ్మాయిని దారుణంగా అత్యాచారం చేసి ఆ తర్వాత తమ పేర్లు చెప్పకూడదని ఆమె నాలుకని తెగ్గోసి మానవ జాతి సిగ్గుపడేలా చేశారు.. ఉత్తరప్రదేశ్ లోని హత్రాస్ లో జరిగిన ఈ హత్యాచార ఘటన దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తుంటే మరోపక్క వివిధ ప్రాంతాలలో మరో మూడు దారుణ హత్యాచార ఘటనలు వెలుగులోకి రావడంతో దేశవ్యాప్తంగా కలకలం రేగింది.

వీటిల్లో రెండు యూపీలోనే జరుగగా, ఒకటి మధ్య ప్రదేశ్ లో వెలుగులోకి వచ్చింది. యూపీలోని ఓ మారుమూల గ్రామంలో 22 ఏళ్ల దళిత యువతిని సామూహిక అత్యాచారం చేసి హత్య చేశారు. బలరామ్ పూర్ గ్రామానికి చెందిన యువతి, తీవ్రగాయాలతో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించగా, సామూహిక అత్యాచారం జరిగినట్టు పోస్టుమార్టం నిర్ధారించింది. ఆమె శరీరంపై పలు చోట్ల గాయాలు కూడా ఉన్నాయని వైద్యుల నివేదిక పేర్కొంది. కాలేజీ అడ్మిషన్ కోసం తన తల్లితో కలసి వెళుతుంటే, లాక్కెళ్లిన దుండగులు ఈ దురాగతానికి పాల్పడ్డారు. ఇక మరో ఘటనలో అజామ్ గఢ్ ప్రాంతంలో 8 ఏళ్ల బాలిక అత్యాచారానికి గురైంది. ఈ కేసులో నిందితుడి వయసు 20 సంవత్సరాలు. ప్రస్తుతం బాలిక ఆసుపత్రిలో ప్రాణాపాయ స్థితిలో ఉంది.

- Advertisement -

మాయమాటలతో బాలికను నమ్మించి, తన ఇంటికి తీసుకెళ్లిన నిందితుడు, ఈ దారుణానికి పాల్పడ్డాడు. బాలిక తీవ్ర రక్త స్రావంతో ఆసుపత్రిలో చికిత్స పొందుతోందని పోలీసులు వెల్లడించారు. ఈ కేసులో నిందితుడు ధనుష్ ని గుర్తించి, అరెస్ట్ చేశామని తెలిపారు. ఇదే సమయంలో మరో ఘటన మధ్యప్రదేశ్ లో చోటు చేసుకుంది. పట్టపగలు, పొలంలో ఓ మైనర్ బాలికను ముగ్గురు అత్యాచారం చేశారు. ఖర్గోనే జిల్లాలో జరిగిన ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపగా, పలు గ్రామాల ప్రజలు తీవ్ర నిరసనలకు దిగడంతో ఉద్రిక్త వాతావరణ పరిస్థితులు నెలకొన్నాయి. తమ ఇంట్లోకి చొరబడిన ముగ్గురు, తనను కొట్టి, తన చెల్లిని లాక్కెళ్లారని, ఆపై చెల్లెలి కోసం గ్రామస్థులతో కలిసి వెతుకగా, ఊరిబయట ప్రాణాపాయ స్థితిలో కనిపించిందని ఆమె అన్న బోరున విలపిస్తూ చెప్పాడు. ఈ కేసులో నిందితుల కోసం గాలింపు మొదలు పెట్టామని జిల్లా ఎస్పీ సింగ్ చౌహాన్ వెల్లడించారు.

Most Popular

హీరో అబ్బాస్ ఇప్పుడు ఎక్కడ ఎలా ఉన్నాడో తెలుసా ?

అబ్బాస్ అంటే తెలియని వ్యక్తి ఉండరు. చేసింది తక్కువ సినిమాలు అయిన మంచి క్రేజ్ తెచ్చుకున్న హీరో అబ్బాస్. ఇప్పటికి యాడ్స్ లో కనిపిస్తూ ఉంటాడు. టీవీ చూసే ప్రతి...

మన స్టార్ హీరోయిన్స్ అసలు పేర్లు ఏంటో తెలుసా ?

ప్రస్తుతం ఇండస్ట్రీలో స్టార్స్ గా ఉన్న ప్రతి సెలబ్రిటీ పేరు మార్చుకునే ఇండస్ట్రీలోకి వచ్చిన విషయం తెలిసిందే. హీరోలు మాత్రమే కాకుండా, హీరోయిన్ల కూడా వారి పేర్లు మార్చుకొని ఇండస్ట్రీకి...

హీరోయిన్ సంఘవి గుర్తుందా ? ఇప్పుడేం చేస్తుందంటే ?

దర్శకుడు భీమనేని శ్రీనివాసరావు దర్శకత్వం వహించిన “సూర్యవంశం” అనే సినిమాతో రెండో హీరోయిన్ గా తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయింది సంఘవి. అయితే ముందు తమిళ సినిమా ద్వారా హీరోయిన్...

Related Articles

హత్రాస్ నిందితులను ఎన్ కౌంటర్ చేయబోతున్నారా..?

నిర్భయ, దిశా, ఉన్నావో, హత్రాస్ ఇలా పేర్లు మారుతున్న ఆడవారిపై జరుగుతున్న అఘాయిత్యాలు మారడం లేదు. రోజుకో రకంగా కామాంధులు ఆడవారిని హింస పెడుతూనే ఉన్నారు.. పైవాటన్నిటికంటే క్రూరంగా హత్రాస్...

ఏపీలోనూ కథువా లాంటి ప‌రిస్థితులున్నాయి..వైస్ జ‌గ‌న్

కథువా, ఉన్నావ్‌లో చోటుచేసుకున్న ఘోరాల‌పై వైసీపీ అధినేత వైస్ జ‌గ‌న్‌మ‌మోహ‌న్ రెడ్డి ట్విట్ట‌ర్‌లో స్పందించారు. ఆడబిడ్డలను కాపాడుకోవడంలో ఒక దేశంగా మనం విఫలం చెందామని జ‌గ‌న్ ఆవేదన వ్యక్తం చేశారు. మానవత్వాన్ని మంటగలిపే...

కాలేజీ అమ్మాయిపై గ్యాంగ్ రేప్

అమ్మాయిలపై రోజురోజుకూ హత్యచార దాడులు పెరిగిపోతున్నాయి. అమ్మాయిలు ఒంటరిగా కనిపిస్తే.. మగాళ్ళు మృగాలుగా మారి హత్యచార దాడులు చేస్తున్నారు. న్యూఢిల్లీలో జరిగిన నిర్భయ ఘటన లాంటి మరో ఘటన తాజాగా ఓడిశాలోని కటక్ జిల్లాలో జరిగింది.

- Advertisement -
Loading...

Recent Posts

- Advertisement -
Loading...