Saturday, April 20, 2024
- Advertisement -

మళ్ళీ మాటమార్చిన పాక్.. ఇప్పుడు దావూద్ ఎక్కడున్నట్లు.!!

- Advertisement -

ఇటీవలే పాక్ లోనే దావూద్ ఇబ్రహీం ఉన్నాడని పాకిస్థాన్ ప్రకటించగా అది చెప్పిన 24 గంటల్లోనే మాటమార్చి పాకిస్థాన్ మరోసారి మోసపూరిత బుద్ధిని బయటపెట్టింది.. ఇకపోతే పాక్ లో దావూద్ ఉన్నాడని పాకిస్థాన్ నిరూపించుకోవాలని దావూద్ ప్రియశిష్యుడు చోటా డాన్ చోటా షకీల్ ఇండియా కి ఇచ్చిన ఫోన్ ఇంటర్వ్యూ లో తెలిపాడు.. . వారం కిందట పాకిస్తాన్ నిషేధిత ఉగ్ర సంస్థలు, దాని అధినేతలపై ఆంక్షలు విధించింది. ఈ జాబితాలో అండర్‌ వరల్డ్‌ డాన్‌ దావూద్‌ ఇబ్రహీం పేరు కూడా ఉంది. ఆయన కరాచీలోనే రెండు అడ్రస్‌లలో ఉంటున్నట్టు.. వాటి చిరునామాలను సయితం ఇచ్చింది.

కరాచీలోని వైట్ హౌస్, సౌదీ మసీదు దగ్గరలోనే ఓ చిరునామాను, కరాచీ నూరాబాద్‌లో ఇంటి నెం. 37 డిఫెన్స్ 30 వీధిలోని పలాటియన్ భవనంలోకూడా ఉంటున్నట్లు పేర్కొంది. అయితే ఈ ప్రకటన ఇచ్చిన 24 గంటల్లోనే తూచ్.. అంటూ దావూద్ తమ దేశంలో లేడంటూ పాత పాటే పాడింది. అయితే ఇమ్రాన్ ప్రభుత్వం ఎందుకలా చెప్పింది. ఉన్నాడన్న మాటను లేడు అని వెంటనే ఎందుకు మార్చేసిందన్నది చాలా మందికి అర్థం కాని విషయం. పాకిస్తాన్ ఇప్పుడు ఆర్థిక ఇబ్బందుల్లో ఉంది. ఏదో ఓ దేశం సాయం చేస్తే తప్ప గట్టెక్కలేని పరిస్థితి. పాకిస్తాన్ ఆర్థిక సాయం పొందాలంటే.. ఉగ్రవాదులపై కఠినంగా ఉండాలి.

ఉగ్రవాదులకు నిధులు, సహకారంపై నిఘా ఉంచే ఫైనాన్షియల్ యాక్షన్ టాస్క్‌ఫోర్స్ గ్రే లిస్ట్ లో పాకిస్థాన్ ఉంది. గత రెండేళ్లుగా గ్రే లిస్ట్‌లో కొనసాగుతోన్న పాక్.. దాని నుంచి తప్పించుకునేందుకు 88 నిషేధిత ఉగ్రసంస్థలు, దాని అధినేతలపై ఆంక్షలు విధించింది. ఇందులో అండర్ వరల్డ్ డాన్ దావూద్ ఇబ్రహీం, జమాత్ ఉద్ దవా చీఫ్ హఫీజ్ సయీద్, జైషే మహ్మద్ చీఫ్ మసూద్ అజహర్, జకీర్ రెహమాన్ లఖ్వీ తదితరుల పేర్లు కూడా ఉన్నాయి. దావూద్ పేరునూ ప్రకటించింది. కానీ ఇప్పుడు ఆర్మీ నుంచి హెచ్చరికలు వచ్చాయేమో కానీ.. దావూద్ అక్కడ లేడని చెబుతోంది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -