శ్రావని హత్యకేసులో దేవరాజ్ సంచలన విషయాలు..?

581
devraj about sravani sucide
devraj about sravani sucide

ప్రముఖ సీరియల్ నటి కొండపల్లి శ్రావణి ఆత్మహత్య టీవీ ఇండస్ట్రీలో కలకలం రేపింది. ఈ కేసు పలు మలుపులు తిరుగుతోంది. హైదరాబాద్‌ మధురానగర్‌లోని తన నివాసంలో మంగళవారం అర్థరాత్రి దాటాక ఉరి వేసుకొని ఆత్మహత్యకు పాల్పడింది శ్రావణి. ఆమె ఆత్మహత్య చేసుకోవడానికి టిక్ టాక్ లో పరిచయమైన దేవరాజ్ అనే వ్యక్తే అని, దేవరాజ్ కు శ్రావణి సీరియల్ అవకాశాలు ఇప్పించిందని, అయినప్పటికీ శ్రావణిని అతడు వేధించేవాడని, వేధింపులు భరించలేకే ఆమె ఆత్మహత్య చేసుకుందని కుటుంబ సభ్యులు ఆరోపించారు.

దేవరాజ్ ఎస్ఎర్ నగర్ పోలీస్ స్టేషన్‌లో లొంగిపోయిన విషయం తెలిసిందే. ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న దేవరాజ్ రెడ్డి పోలీసుల విచారణలో సంచలన విషయాలు వెల్లడించాడు. ఈ కేసులో సాయి అకృత్యాలను పోలీసులకు వివరించాడు. శ్రావణి కుటుంబ సభ్యులు, సాయి కొట్టడంతోనే ఆమె ఆత్మహత్య చేసుకుందని, తల్లిదండ్రులు, కుటుంబసభ్యులు కొడుతున్నారని శ్రావణి తనతో మాట్లాడిందని చెప్పాడు. తన చావుకు సాయే కారణమని చివరిసారిగా శ్రావణి మాట్లాడిన ఆడియో, అలాగే గతంలో సాయి తనపై (దేవరాజ్‌) దాడి చేసి రక్తం వచ్చేలా కొట్టిన సాక్ష్యాలను దేవరాజ్ పోలీసుల ముందుంచాడు.

విచారణలో సాయి పాత్రపై దేవరాజ్ సంచలన విషయాలు వెల్లడించాడు. అలాగే కృష్ణానగర్‌లో అమ్మాయిలను సాయి ట్రాప్ చేస్తాడని దేవరాజ్ చెప్పాడు. శ్రావణిని సయితం అలాగే ట్రాప్ చేశాడని దేవరాజ్ తెలిపాడు. దేవరాజ్‌తో విడిపోవాలంటూ శ్రావణిని సాయి వేధింపులకు గురిచేశాడని, వేధింపులు తాళలేకే శ్రావణి ఆత్మహత్య చేసుకున్నట్లు విచారణలో దేవరాజ్ వెల్లడించాడు.

Loading...