ప్రణయ్ హత్యకి మారుతీరావు డబ్బు ఎలా ఇచాడంటే ?

644
Did you know how Maruti Rao gave money for Pranay murder
Did you know how Maruti Rao gave money for Pranay murder

మిర్యాలగూడ పరువు హత్య కేసులో తాజాగా సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. తమకంటే తక్కువ కులం వ్యక్తిని తన కూతురు అమృత ప్రేమించి పేళ్లి చేసుకుందన్న కోపంతో ప్రణయ్ ను మారుతీరావు హంతకుల చేత హత్య చేయించిన విషయం తెలిసిందే. అయితే తాజాగా మారుతీరావు కూడా ఆత్మహత్య చేసుకున్నాడు. ఇకపోతే నల్లగొండ జిల్లా ఎస్సీ ఎస్టీ ప్రత్యేక ఫాస్ట్ ట్రాక్ కోర్టు మంగళవారం ప్రణయ్ హత్య కేసును విచారించింది.

ఈ కేసులో పోలీసులు పైల్ చేసిన చార్జిషీటుపై ఈ మేరకు కోర్టు దృష్టిసారించింది. తన కూతురు తక్కువ కులం వాణ్ని పెళ్లి చేసుకుందని తన ఆస్తిలో కొంత భాగాన్ని ఆమ్మేసి ప్రణయ్ హత్యకు మారుతీరావు సుపారీ ఇచ్చినట్లు చార్జిషీటులో పోలీసులు పొందుపరిచారు. ఎంత చెప్పిన వినకుండా ప్రణయ్ ను అమృత పెళ్లి చేసుకుని తమ పరువు తీసిందన్న కోపంలో ప్రణయ్ ను హత్య చేయించడానికి మారుతీరావు సిద్దమయ్యాడని.. కిరాయి హంతకులకు డబ్బులు చెల్లించడానికి చింతపల్లి క్రాస్ రోడ్ దగ్గరున్న ప్లాట్ ను అమ్మకానికి పెట్టాడని చార్జిషీటులో వెల్లడైంది.

హత్య కేసులో ఏ2గా ఉన్న మారుతిరావు సోదరుడు శ్రవణ్ ఈ విషయాలను పోలీసుల ముందు ఒప్పుకున్నాడు. ప్రణయ్ హత్య కేసుకు సంబంధించి పోలీసులు మొత్తం 1200 పేజీలతో కూడిన ఛార్జ్ షీటును చేశారు. ఇందులో 102 మంది సాక్షుల స్టేట్మెంట్లను పొందుపర్చారు. ఏ1 మారుతిరావు శనివారం హైదరాబాద్ లో ఆత్మహత్య చేసుకోగా ఏ2 శ్రవన్ మంగళవారం నాటి కోర్టు విచారణకు హాజరు కాలేదు. మిగతా ఆరుగురు నిందితులులను పోలీసులు కోర్టులో హాజరు పర్చారు.

కూతురు కులం తక్కువవాణ్ని పెళ్లి చేసుకున్న తర్వాత సమాజంలో తలెత్తుకోలేక పోయానని పెళ్లి తర్వాత కూడా బంధువులతో రాయబారం పంపినా అమృత తిరిగిరాలేదని కాబట్టే ప్రణయ్ ని చంపాలనుకున్నానని హత్య చేయించేందుకు కావాల్సిన డబ్బును శ్రవణ్ ఏర్పాటు చేశాడని మారుతీరావు చెప్పినట్లు స్టేట్మెంట్ లో రికార్డైంది.

Loading...