దిశ కేసులో కొత్త నిందితులు.. వీళ్ళేం చేశారంటే ?

5195
Disha Case New Update
Disha Case New Update

దేశంలో ప్రతి రోజు అత్యాచార ఘటనలు చూస్తునే ఉన్నాం. ఇటివలే దిశను అత్యాచారం చేసి ఆపై హత్య చేసిన నలుగురు నిందితులను పోలీసులు ఎన్ కౌంటర్ చేశారు. ఈ నేపథ్యంలో ఇప్పుడు మరో కొత్త కోణం వెలుగులోకి వచ్చింది. మహమ్మద్ ఆరీఫ్, చెన్నకేశవులు, శివ తదితరులు కలిసి హైదరాబాదులోని శంషాబాద్ దగ్గర అర్ధరాత్రి పూట చేసిన ఈ మదోన్మాద ఘటన వెనుక ఉన్న కొత్త నిందితులు ఇప్పుడు నిదానంగా బయటికి వస్తున్నారు.

ఆ రోజు టోల్ గేటు వద్ద దిశ స్కూటీని పంక్చర్ చేసిన ఆ నలుగురు.. ఆ తర్వాత స్కూటీ పంక్చర్ వేసుకుని వచ్చేందుకు నలుగురిలో ఒకరు వెళ్లారు. ఆ తర్వాత సరైన టైం కోసం చూస్తూ చాలా సేపు ఉన్నారు. ఆ టైంలోనే దిశ తన చెల్లికి ఫోన్ చేసి తన స్కూటీకి ఇలా ప్రాబ్లం వచ్చిందని.. తనకు ఎందుకో కొంచెం భయంగా ఉందని తనతో ఫోన్లో మాట్లాడుతూ ఉండమని చెప్పిన విషయం తెలిసిందే.

అయితే తాను టోల్ గేటు వెలుగుల మధ్య ఉన్నంతవరకు ఆమె చాలా సురక్షితంగానే ఉంది. ఛాన్స్ కోసం నలుగురు నిందితులు అలోచిస్తూ ఉన్నారు. అదే టైంలో టోల్ గేటు వద్ద ఉన్న రహదారి మీద వెళ్తున్న కుర్రకరు మరియు టీనేజర్లు, తాగుబోతులు ఆమె అలా ఒక్కతే రోడ్డు పక్కన ఉండటం చూసి ఆమె మీద కామెంట్స్ చేయడం మరియు కించపరిచేలా సూటిపోటి మాటలు మాట్లాడటంతో ఆమె చాలా సిగ్గుగా ఫీల్ అయింది. అందుకే ఆమె వాళ్ల కామెంట్స్ నుంచి తప్పించుకోవడానికి అక్కడ నుంచి కాస్త చీకట్లోకి వెళ్లగా ఆ నలుగురు నిందితులు ఆమెపై ఈ దారుణానికి ఒడిగట్టారు.

Loading...