దిశపై అత్యాచారానికి ముందు 9 మంది మహిళలపై హత్యాచారం..!

1594
Disha Case Victims
Disha Case Victims

దిశ హత్యాచార కేసు దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. అయితే ఈ కేసులోని నిందితులకు సంబంధించి మరికొన్ని షాకింగ్ విషయాలు బయటకు వచ్చాయి. విచారణలో భాగంగా ఎవరికి తెలియని షాకింగ్ నిజాలు బయటకు వచ్చాయి. దిశపై అత్యాచారానికి తెగబడడానికి ముందు నిందితులు మరో 9 మంది మహిళలపై అత్యాచారం చేసి హత్య చేసినట్లు పోలీసులకు ఇచ్చిన వాంగ్మూలంలో వెల్లడించినట్లు తెలుస్తోంది. దిశ కేసులో ప్రధాన నిందితుడైన అరీఫ్ ఆరుగురిని హత్య చేయగా.. చెన్న కేశవులు ముగ్గురిని అంతమొందించినట్లు చెప్పారు.

ఈ ఘటనలన్నీ మహబూబ్ నగర్, సంగారెడ్డి, రంగారెడ్డి, హైదరబాద్, కర్ణాటక ప్రాంతాల్లోని హైవేల సమీపంలో చేసినట్లు నిందితులు అంగీకరించినట్లు తెలుస్తోంది. అత్యాచారం అనంతరం హత్య చేసి మృతదేహాలను దహనం చేసినట్లు నిందితులు తమ వాంగ్మూలంలో వెల్లడించినట్లు సమాచారం.

Disha Caseవారు చెప్పిన సమాచారం ఆధారంగా దర్యాప్తు ప్రారంభించిన పోలీసులు ఆయా ప్రాంతాల్లో మొత్తం 15 ఘటనలు జరిగినట్టు గుర్తించారు. దిశ నిందితుల డీఎన్ఏను మృతి చెందిన వారి డీఎన్ఏతో విశ్లేషిస్తున్నారు. నిందితులకు సంబంధించి కోర్టుకు సమర్పించనున్న చార్జిషీట్‌లో వారు వెల్లడించిన నేరాలకు సంబంధించిన వివరాలను కూడా పొందుపర్చనున్నట్టు తెలుస్తోంది.

Loading...