దిశ కేసులో నిందుతుల ఎన్‍కౌంటర్ పై దిశ తల్లి దండ్రుల స్పందన..!

3520
Disha Parents Reaction
Disha Parents Reaction

షాద్ నగర్ ల్ వెటర్నరీ డాక్టర్ దిశ ని నలుగురు మృగాళ్లు అత్యంత కిరాతకంగా అత్యాచారం చేసి.. హత్య చేసి సజీవదహనం చేసిన విషయం దేశం మొత్తం సంచలనం సృష్టించింది. తాజాగా దిశ కేసులో నిందితులుగా ఉన్న నలుగురిని పోలీసులు ఎన్ కౌంటర్ చేశారు. చటాన్ పల్లి వద్ద రీ కన్‍స్ట్రక్షన్ చేస్తుండగా నిందితులు పారిపోయేందుకు ప్రయత్నించడంతో పోలీసులు ఆత్మ రక్షణ కోసం ఆ నలుగురు నిందితులను ఎన్ కౌంటర్ చేశారు.

కేసు విచారణలో భాగంగా ఆ నలుగురు నిందితులను ఘటన స్థలంకు తీసుకెళ్లి సీన్ రీ కన్‍స్ట్రక్షన్ చేస్తుండగా.. వారి పారిపోయేందుకు ప్రయత్నించడంతో పాటు పోలీసులపై దాడికి యత్నించారు. దాంతో వారిపై పోలీసులు కాల్పులు జరపడంతో నిందితులు ఆరిఫ్, జొల్లు శివ, నవీన్, చెన్నకేశవులు మృతి చెందారు. ఈ సంఘటన తెల్లవారు జామున మూడు గంటలకు జరిగింది. ముందుగా ఆరిఫ్ పోలీసుల పైకి దాడికి ప్రయత్నించగా ..ఆ తరువాత మిగిలిన ముగ్గురు కూడా దాడికి పాల్పడట్టు సమాచారం.

దిశని కాల్చిన చోటే నిందితులని ఎన్కౌంటర్ చేయడంతో దిశ తల్లిదండ్రులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ముందు మేము ఫిర్యాదు చేసినప్పుడు పట్టించుకోని పోలీసులు.. ఇప్పుడు కరెక్ట్ పని చేశారని అన్నారు. ఈ దెబ్బ తో మహిళల పట్ల అసభ్యంగా ప్రవర్తించే వారికి వణుకు పుట్టాలని దిశ తల్లిదండ్రులు అభిప్రాయం వ్యక్తం చేశారు.

Loading...