మరదలిపై మనసుపడి.. భార్యను చంపేశాడు..!

340
husband who murdered his wife kurnool district pyapili
husband who murdered his wife kurnool district pyapili

అతను మరదలిపై మనసు పడ్డాడు. అందుకే జీవితాంతం తోడు ఉంటానని వచ్చిన భార్య ఆయువు తీశాడు. ఈ ఘటన అలేబాద్ తండాలో సోమవారం వెలుగులోకి వచ్చింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. రెండేళ్ల క్రితం అలేబాదు తండాకు చెందిన రవినాయక్‌తో బేతంచెర్ల మండలం గోరుమాను కొండ తండాకు చెందిన సుశీలబాయికి పెళ్లి అయింది.

వీరికి ఏడాది వసుకున్న కూతురు ఉంది. అయితే కొద్దిరోజుల నుంచి సుశీలబాయి చెల్లిని పెళ్లి చేసుకుంటానని రవినాయ్క్ చెప్పేవాడు. ఈ విషయంలో భార్యభర్తల మధ్య వాగ్వాదం జరిగేది. దాంతో భార్యను అంతమొందించాలని పథకం వేసిన రవినాయక్‌.. ఆదివారం తనతో పాటు జీవాలు మేపేందుకు కొండకు తీసుకెళ్లాడు. అక్కడ ఆమెను బండరాళ్లతో కొట్టి చంపేసి మృతదేహాన్ని లోయలోకి తోశాడు. తర్వాత ఏం తెలియనట్లు ఇంటికి వచ్చి తన భార్య కనబడడంలేదని గ్రామస్తులకు చెప్పాడు.

భార్య తల్లిదండ్రులకు ఇదే విషయాన్ని ఫోన్‌ చేసి చెప్పడంతో ఆందోళనకు గురై రాత్రికి రాత్రే గ్రామానికి చేరుకొని కుమార్తె కోసం గాలించారు. సుశీల బాయి మృతదేహం గ్రామ శివార్లలోని లోయలో పడి ఉండడాన్ని సోమవారం ఉదయం గమనించిన పశువుల కాపరులు విషయాన్ని గ్రామస్తులకు తెలియజేశారు. ఈ విషయం వెలుగులోకి రావడంతో నిందితుడు రవినాయక్‌ పరారయ్యాడు. హతురాలి తండ్రి సేవ్యా నాయక్‌ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

లాక్ డౌన్ పెట్టడం పై.. టెస్టులు పై మంత్రి ఈటెల క్లారిటీ..!

లోకేష్ పని అయిపోయిందా ? ఇక అరెస్టేనా ?

ప్రజల డబ్బు పందికొక్కుల్లా తిన్నా.. వదిలేయాలా..?

అచ్చెం నాయుడు ఆరోగ్యంపై జగన్ సంచలన నిర్ణయం..?

Loading...