Friday, March 29, 2024
- Advertisement -

మ‌రో సారి ప్ర‌మాదంనుంచి బ‌య‌ట‌ప‌డ్డ క‌న్న‌డ న‌టుడు స‌దీప్‌..

- Advertisement -

బహుభాషా నటుడు, క‌న్న‌డ స్టార్ హీరో సుదీప్ రోడ్డు ప్ర‌మాదంలో గాయ‌ప‌డిన‌ట్లు తెలుస్తోంది. 2016 సంవ‌త్స‌రంలో ఓ సారి ప్ర‌మాదం భారిన ప‌డ్డ సుదీప్ తాజాగా పైల్వాన్ చిత్ర షూటింగ్‌లో గాయ‌ప‌డ్డ‌ట్టు స‌మాచారం. చిత్రీక‌ర‌ణ స‌మ‌యంలో కారు ప్ర‌మాదం జ‌ర‌గ‌డం వ‌ల‌న ఆయ‌న‌కి స్వ‌ల్ప గాయాల‌య్యాయ‌ని, ప్ర‌స్తుతం ఆయ‌న చికిత్స తీసుకుంటున్నారు.

మాదం నేపథ్యంలో ఇటీవల జరిగిన ‘విలన్’ సినిమా టీజర్ విడుదలకు సుదీప్ గైర్హాజరయ్యారు. తాను గాయపడ్డందున ఈ కార్యక్రమానికి రాలేకపోతున్నట్లు సుదీప్ ట్వీట్ చేశారు. ఈ నేపథ్యంలో సుదీప్ త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తూ ఆయన అభిమానులు పలు ఆలయాల్లో పూజలు నిర్వహిస్తున్నారు.

ఈగ చిత్రంతో తెలుగు ప్రేక్ష‌కులకి ద‌గ్గ‌రైన సుదీప్ బాహుబ‌లి మొద‌టి పార్ట్‌లో న‌టించాడు. ప్ర‌స్తుతం సైరాలోను ముఖ్య పాత్ర పోషిస్తున్నాడు. సుదీప్, శివ‌రాజ్‌కుమార్ క‌లిసి న‌టించిన ది విల‌న్ చిత్రం అక్టోబ‌ర్ 18 విడుదల కానుంది. చిత్రంలో అమీ జాక్సన్ క‌థానాయిక‌గా న‌టిస్తుండగా, బాలీవుడ్‌ దిగ్గజం మిథున్‌ చక్రవర్తి, టాలీవుడ్‌ సీనియర్‌ నటుడు శ్రీకాంత్‌ కీలక పాత్రల్లో కనిపించబోతున్నారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -