Saturday, April 20, 2024
- Advertisement -

జ‌మ్మూకాశ్మీర్ మాజీ ముఖ్య‌మంత్రి ఫరూక్ అబ్దుల్లా ఇంట్లోకి ప్ర‌వేశించిన వ్య‌క్తి….కాల్చి చంపిన సెక్యూరిటీ

- Advertisement -

జమ్మూకశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి, నేషనల్ కాన్ఫరెన్స్ అధినేత ఫరూక్ అబ్దుల్లా ఇంటివద్ద ఈ రోజు కలకలం రేగింది. జమ్మూలోని భటిండి ప్రాంతంలోని ఇంట్లోకి ఓ వ్యక్తి కారుతో బలవంతంగా దూసుకెళ్లేందుకు యత్నించాడు. దీంతో అప్రమత్తమైన బలగాలు అతడిని కాల్చిచంపాయి.

అయితే కారుతో ఫారూక్ ఇంట్లోకి చొరబడేందుకు ప్రయత్నించిన వ్యక్తి ఎవరన్నది ఇంకా స్పష్టం కాలేదు. మాజీ కేంద్ర మంత్రి, మాజీ సీఎం అయిన ఫారూక్ అబ్దుల్లాకు ప్ర‌స్తుతం జెడ్ ప్ల‌స్ సెక్యూర్టీ ఉంది. క‌శ్మీర్‌కు చెందిన మాజీ సీఎంలు ఒమ‌ర్ అబ్దుల్లా, గులాం న‌బీ ఆజాద్‌, మొహ‌బూబా ముఫ్తీల‌కు కూడా జెడ్ ప్ల‌స్ భ‌ద్ర‌త ఉంది.

ఎస్‌యూవీ వాహ‌నంలో ఓ వ్య‌క్తి ఇంట్లోకి ప్ర‌వేశించేందుకు య‌త్నించాడు. భ‌టిండిలో ఫారూక్ నివాసం ఉన్న‌ది. ఇవాళ ఉద‌యం 9.30 నిమిషాల‌కు ఈ ఘ‌ట‌న జ‌రిగింది. అయితే ఇదేమీ ఉగ్ర కుట్ర కాద‌ని ఎస్పీ వివేక్ గుప్తా తెలిపారు. కాగా, మృతుడి దగ్గర ఎలాంటి ఆయుధాలు లభ్యం కాలేదని పోలీసులు తెలిపారు. నిందితుడ్ని అడ్డుకునే క్రమంలో ఓ పోలీస్ అధికారి గాయపడినట్లు వెల్లడించారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -