వికారాబాద్ దీపికా కేసులో వెలుగులోకి సంచలన విషయాలు..?

- Advertisement -

వికారాబాద్‌లో మూడు రోజుల క్రితం కిడ్నాప్‌కు గురైన దీపిక కేసులో ఊహించని ట్విస్ట్ నెలకొంది. తాను ఇష్టపూర్వకంగానే తన భర్త అఖిల్‌తో వెళ్లినట్టు పోలీసులకు దీపిక ఫోన్ చేసి చెప్పినట్టు సమాచారం. వికారాబాద్‌కు చెందిన దీపిక, అఖిల్‌ 2016లో ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. అయితే వీరి పెళ్ళి దీపిక తల్లిదండ్రులకు ఇష్టం లేకపోవడంతో రెండేళ్ల క్రితం ఆమెని ఇంటికి తీసుకొచ్చేశారు.

అనంతరం తల్లిదండ్రులు బలవంతం చేసి అఖిల్‌ నుంచి విడాకులు కోరుతూ దీపికతో కోర్టులో పిటిషన్‌ దాఖలు చేయించినట్టు తెలుస్తుంది. ఈ క్రమంలోనే శనివారం వీరిద్దరు వికారాబాద్ కోర్టుకు హాజరయ్యారు. అయితే ఆదివారం సాయంత్రం దీపిక షాపింగ్‌కు వెళ్లి ఇంటికి వెళ్తుండగా ఓ కారులో వచ్చిన ముగ్గురు వ్యక్తులు దీపికను బలవంతంగా ఎత్తుకెళ్ళినట్టు ఆమె తల్లిదండ్రులు వికారాబాద్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.

- Advertisement -

అయితే గత మూడు రోజులగా దీపిక ఆచూకీ కోసం ఆరు బృందాలుగా ఏర్పడి పోలీసులు గాలింపు చేపట్టారు. అయితే కొద్దిసేపటి క్రితం ఇష్టపూర్వకంగానే తన భర్త అఖిల్‌తో వెళ్లినట్టు దీపిక పోలీసులకు ఫోన్ చేయడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. అయితే పోలీసుల సూచన మేరకు దీపిక, అఖిల్ వికారాబాద్ పోలీస్ స్టేషన్‌కి రానున్నారు.

Most Popular

మా బ్యాటింగ్ చాలా దారుణంగా ఉంది.. ఏం చేయలేకపోయాం : ధోనీ

వరుస వైఫల్యం ఎదురుకావడం చాలా బాధగా ఉందని చెనై సూపర్ కింగ్స్ కెఫ్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ అన్నారు. శుక్రవారం చెన్నైపై ముంబై ఇండియన్స్ 10 వికెట్లతో ఘనవిజయం సాధించింది....

మన స్టార్ హీరోయిన్స్ అసలు పేర్లు ఏంటో తెలుసా ?

ప్రస్తుతం ఇండస్ట్రీలో స్టార్స్ గా ఉన్న ప్రతి సెలబ్రిటీ పేరు మార్చుకునే ఇండస్ట్రీలోకి వచ్చిన విషయం తెలిసిందే. హీరోలు మాత్రమే కాకుండా, హీరోయిన్ల కూడా వారి పేర్లు మార్చుకొని ఇండస్ట్రీకి...

‘బిగ్ బాస్’లోకి వైల్డ్ కార్డ్ ఎంట్రీ ద్వారా మంగ్లీ..!

తెలుగు రియాల్టీ షో బిగ్ బాస్ మంచి రేటింగ్ తో దూసుకెళ్తోంది. ఇప్పటికే షో మొదలై సంగం రోజులు పూర్తైంది. ఇప్పుడు హౌస్ లోకి మరో కంటెస్ట్ంట్ వైల్ కార్డ్...

Related Articles

ఐదేళ్ల చిన్నారిపై అత్యాచారం….

చిన్నారులపై కామాంధులు రెచ్చిపోతున్నారు. చిన్న పిల్లలు అని చూడకుండా వారిపై అత్యాచారాలు చేస్తున్న ఘటనలు పెరిగిపోతున్నాయి. వారిని న్యాయస్థానాలు ఉరిశిక్షలు విధిస్తున్నా వారిలో మాత్రం మార్పు రావడంలేదు. తాజాగా...

వికారాబాద్‌లో దారుణ హ‌త్య‌కు గుర‌యిన టీఆర్ఎస్ నాయ‌కుడు

వికారాబాద్ జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. టీఆర్ఎస్ నేత నారాయ‌ణ రెడ్డిని దార‌ణ హ‌త్య‌కు గుర‌య్యారు. ప‌రిగి మండ‌లం సుల్తాన్ పుర్‌లో ఈ సంఘ‌ట‌న చోటు చేసుకుంది. గత కొంత కాలంగా ఓ...

టీసీ నుంచి తప్పించుకోవడానికి రైలునుంచి దూకిన యువ‌కుడు..?

టికెట్ లేని ప్రయాణం ఓ యువకుడి ప్రాణాలు తీసింది. ఈ విషాద సంఘ‌ట‌న గొల్లగూడ రైల్వేస్టేషన్ సమీపంలో విషాదం చోటు చేసుకొంది. రైలులో టీసీని చూసి అతడిని తప్పించుకోబోయి రైలు నుంచి కిందికి...
- Advertisement -
Loading...

Recent Posts

- Advertisement -
Loading...