Friday, March 29, 2024
- Advertisement -

ప‌రువుకు మ‌రో నిండు ప్రాణం బ‌లి…

- Advertisement -

హైదరాబాద్ పాతబస్తీలో మరో కులాంతర ప్రేమపెళ్లి విషాదంగా ముగిసింది. అమ్మాయిని ఆమె తల్లిదండ్రులు తీసుకెళ్లిపోవడంతో మనస్తాపానికి గురై ఒంటిపై పెట్రోల్ పోసుకొని నిప్పంటించుకున్నాడు. తీవ్ర గాయాలపాలైన అతడు ఉస్మానియా ఆస్పత్రిలో మృత్యువుతో పోరాడుతూ మధ్యాహ్నం ప్రాణాలు విడిచాడు. తాను చనిపోయే ముందు తన చావుకు శ్రీహర్ష కుటుంబ సభ్యులే కారణమని శ్రీకాంత్ సెల్ఫీ వీడియోలో తెలిపాడు.

పాతబస్తీలోని బాబా నగర్ కు చెందిన శ్రీకాంత్ నకిరేకల్ కు చెందిన శ్రీహర్ష అనే యువతిని నాలుగేళ్ల క్రితం ప్రేమ వివాహం చేసుకున్నాడు. అయితే ఇద్దరి కులాలు వేరు కావడంతో అమ్మాయి తల్లిదండ్రులు ఇందుకు అంగీకరించలేదు. అతణ్ని బెదిరించి శ్రీహర్షను బలవంతంగా తీసుకెళ్లిపోయారు. అంతేకాకుండా ఆమెకు అబార్షన్ కూడా చేయించారు. దీంతో శ్రీకాంత్ మనస్తాపానికి గురయ్యాడు.

శ్రీహర్ష తండ్రి షన్ముఖాచారి పోలీసు శాఖలో పనిచేస్తున్నట్లు శ్రీకాంత్ తెలిపాడు. శ్రీహర్ష సోదరుడు కూడా పోలీస్ డిపార్ట్‌మెంట్‌లో పనిచేస్తున్నట్లు చెప్పాడు. పోలీసుల ద్వారా ఒత్తిడి తీసుకొచ్చి శ్రీహర్షను తీసుకెళ్లిపోయారిన శ్రీకాంత్ చెప్పాడు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -