Tuesday, April 23, 2024
- Advertisement -

చంద్ర‌బాబుపై హైకోర్టు పిటిష‌న్ దాఖ‌లు….

- Advertisement -

ఏపీ ఎన్నికల‌కు ముందు ముఖ్య‌మంత్రిగా ఉన్న చంద్ర‌బాబు చేసిన జిమ్మిక్కులు అన్నీ ఇన్నీ కావు. ఎన్నిక‌ల కోడ్ ఉన్నా అధికారంచేతిలో ఉంది క‌దాని ఇష్ట‌మొచ్చ‌న రీతిలో నిధులు ఖ‌ర్చుచేశాడు. తాను తన, కొడుకు లోకేష్‌తో పాటు మంత్రుల అవినీతి, జన్మభూమి కమిటీల లంచగొండితనం వెరసి వచ్చే ఎన్నికల ఓటమి తప్పదని భావించాడు. ఇక్కడే చంద్రబాబు తన జిత్తులమారి బుద్దిని ప్ర‌ద‌ర్శించాడు.

అప్ప‌టికే టీడీపీ ప్ర‌భుత్వంపై పూర్తి వ్య‌తిరేకంగా ఉన్న ప్ర‌జ‌ల‌ను త‌మ‌వైపు తిప్పుకొనేందుకు నిధుల‌ను భారీగా త‌న అనుయాయుల‌కు ఖ‌ర్చుచేశారు. అప్పుడు చేసిన అనైతిక ప‌నులు ఇప్పుడు వెంటాడుతున్నాయి. తాజాగా నిధుల దుర్వినియోగంలో ఏపీ హైకోర్టులో బాబుపై పిటిష‌న్ దాఖ‌ల‌య్యింది. ఎన్నికల సందర్భంగా ప్రభుత్వ నిధులు దుర్వినియోగం చేశారంటూ ఆయనపై రిపబ్లిక్‌ పార్టీ అధికార ప్రతినిధి బోరుగడ్డ అనిల్‌కుమార్‌ ఈ పిటిషన్‌ దాఖలు చేశారు.

ప్ర‌భుత్వ పథకాల పేరుతో ఎన్నికల ప్రచారానికి చంద్రబాబు ప్రభుత్వ సొమ్మును వాడుకున్నారని ఆరోపించారు. ఈ నిధుల మొత్తాన్ని చంద్రబాబు సొంత ఖర్చుల కింద జమ చేయాలని న్యాయస్థానాన్ని కోరారు. కాగా, అనిల్ కుమార్ దాఖలు చేసిన పిటిషన్ ను ఏపీ హైకోర్టు సోమవారం విచారించనుంది.మొత్తంగా ఈ కేసులో న్యాయమూర్తులు విచక్షణతో విచారణ జరిపితే చంద్రబాబు దోషిగా చట్టం ముందు నిలబడే అవకాశం ఉంది. మరి హైకోర్టు ఈ కేసుపై ఎలా స్పందిస్తుందో చూడాలి.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -