నటి శ్రావణి హత్యలో వెలుగులోకి సంచలన విషయాలు..?

271
sensational case sravani suicide
sensational case sravani suicide

తెలంగాణ లో నటి శ్రావణి ఆత్మహత్య ఒక్కసారి సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే.. అయితే చివరకు సీరియ‌ల్ న‌టి శ్రావ‌ణి ఆత్మ‌హ‌త్య కేసును పోలీసులు చేధించిన‌ట్లు తెలుస్తోంది. కేసులో ఆరోప‌ణ‌లు ఎదుర్కొంటున్న దేవ‌రాజ్, సాయి ఇద్ద‌రు త‌మ అదుపులో ఉన్న‌ట్లు పోలీసులు పేర్కొన్నారు. మ‌ద్యాహ్నాం త‌ర్వాత వారిని మీడియా ముందు ప్ర‌వేశ‌పెట్ట‌బోతున్నారు.

ఈ కేసులో ఏ-1గా దేవ‌రాజ్, ఏ-2 సాయిని పేర్కొన‌గా… ఏ-3గా ఆర్ఎక్స్100హీరో నిర్మాత అశోక్ రెడ్డిల‌ను చేర్చిన‌ట్లు తెలుస్తోంది. దేవ‌రాజ్-అశోక్ రెడ్డిల మ‌ధ్య ఏమైనా లింకులున్నాయా అన్న కోణంలోనూ పోలీసులు ద‌ర్యాప్తు చేసిన‌ట్లు తెలుస్తోంది.

కేసు విచార‌ణ ముగిసింద‌ని, త్వ‌ర‌లోనే వివ‌రాలు వెల్ల‌డిస్తామ‌ని వెస్ట్ జోన్ డీసీపీ శ్రీ‌నివాసులు తెలిపారు. ఈ కేసులో శ్రావ‌ణి కుటుంబ స‌భ్యుల‌ను కూడా విచారించిన‌ట్లు ప్ర‌క‌టించాడు.

Loading...