లారీలో దిశను తీస్కెళ్తున్న వీడియో వైరల్..!

21414
shocking disha’s accused taken her in lorry video viral
shocking disha’s accused taken her in lorry video viral

దిశ హత్యాచారం కేసులో మరో కీలక ఆధారం బయటకు వచ్చింది. గత నెల 27వ నైట్ టైంలో నలుగురు నిందితులు వెటర్నరీ డాక్టర్‌ దిశపై అత్యాచారం చేసి.. హత్య చేసిన విషయం తెలిసిందే.

ఈ ఘటన అనంతరం నిందితులు చటాన్‌పల్లిలోని సంఘటన స్థలంలోనే పోలీసులు జరిపిన ఎన్‌కౌంటర్‌లో హతమయ్యారు. హత్యాచారం, నిందితుల ఎన్‌కౌంటర్‌ దేశవ్యాప్తంగా సంచలనం రేపిన క్రమంలో ఈ ఘటనకు సంబాంధించిన కీలక వీడియో వెలుగులోకి వచ్చింది. ఈ వీడియో ఆధారంగానే పోలీసులు దిశ కేసును ఛేదించి నిందితులను గుర్తించారు.

నవంబర్‌ 27వ తేదీన రాత్రి 10.28 గంటల సమయంలో తొండూపల్లి టోల్‌గేట్ వద్ద నుంచి వెళ్తున్న ఈ లారీలో దిశ మృతదేహాన్ని నిందితులు తరలించారని పోలీసులు గుర్తించారు. టోల్‌గేట్‌ వద్ద ఉన్న సీసీటీవీ కెమెరాల్లో లారీ వెళ్తున్న దృశ్యాలు రికార్డ్ అయ్యాయి. ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. మీరు ఓ లుక్కేయండి.

Loading...