సుశాంత్ డ్రగ్స్ తీసుకుంటున్న వీడియో నిజమేనా..?

584
sushanth drugs taking video
sushanth drugs taking video

దేశవ్యాప్తంగా సంచలనం రేకిస్తున్న సుశాంత్ మరణం కేసులో రోజు కో విషయం ఆసక్తికరంగా మారుతుంది.. ఈ కేసులో అయన ప్రియురాలు రియ చక్రవర్తి ప్రధాన నిన్దితురాలి గా గుర్తించిన పోలీసులు ఆమెను అరెస్ట్ చేశారు. కాగ ఈ సూసైడ్ కేసు కాస్త ఇప్పుడు డ్రగ్స్ కేసు గా మారిన సంగతి తెలిసిందే.. సుశాంత్‌ మృతికి రియానే కారణమని ఆరోపిస్తూ ఆమెపై కేసులు నమోదు చేశారు. తరువాత ఇందులో మనీ లాండరింగ్‌, డ్రగ్స్‌ కోణాలు కూడా ఉండడంతో ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఈడీ), నార్కోటిక్స్‌ కంట్రోల్‌ బ్యూరో (ఎన్‌సీబీ)లు విడివిడిగా ఈ కేసును దర్యాప్తు చేపట్టాయి.

ఈ క్రమంలోనే ఎన్‌సీబీ ఇటీవలే రియాతోపాటు ఆమె సోదరుడు షౌవిక్‌ చక్రవర్తి, సుశాంత్‌ ఇంటి మేనేజర్‌ శామ్యూల్‌ మిరాండాలను అరెస్టు చేసింది. ఇక శుక్రవారం రియా పెట్టుకున్న బెయిల్‌ పిటిషన్‌ను కోర్టు కొట్టివేసింది.అయితే ఎన్‌సీబీ దర్యాప్తులో భాగంగా రియా అధికారులకు సుశాంత్‌ డ్రగ్స్‌ తీసుకునేవాడని చెప్పినట్లు తెలిసింది. ఈ క్రమంలోనే ఈ ఇద్దరూ గతంలో గంజాయి సిగరెట్లు తాగుతున్న వీడియో ఒకటి ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. ఓ మీడియా సంస్థ ఈ వీడియోను సేకరించగలిగింది. దీంతో ప్రస్తుతం ఈ విషయం చర్చనీయాంశమవుతోంది.

ఆ వీడియోలో రియా చక్రవర్తి, సుశాంత్‌ సింగ్‌ ఇద్దరూ గంజాయి సిగరెట్లు తాగుతూ కనిపించారు. అందులో రియా.. రోల్డ్‌ సిగరెట్‌.. అని అంటుండడం గమనించవచ్చు. ఇక అందులోనే ఉన్న మరొక వ్యక్తి.. చరస్‌.. అని, హెర్బల్‌ స్టిక్స్‌ అని అంటుండడాన్ని కూడా చూడవచ్చు. ఈ క్రమంలోనే ఈ వీడియో ప్రస్తుతం వైరల్‌ అవుతోంది. కాగా రియా ప్రస్తుతం ఎన్‌సీబీ అదుపులో ఉండగా.. ఆమె ప్రస్తుతం జైలులో కస్టడీలో ఉంది.

Loading...